మరో వ్యక్తిని.. కొట్టి చంపిన పోలీసులు..  

ప్రపంచం నలుదిక్కుల ఎక్కడ చూసిన ఇప్పుడు వినిపించే పేరు కరోనా. ఈ కరోనా మహమ్మారి విసిరిన పంజాకి మానవ సమాజం వణిపోతుంది. వరిసేలా విసిరితే చెట్టు మీద పిట్టలు ఎగిరిపోయినట్లు. మనుషుల ప్రాణాలు క్షణంలో  ఎగిరిపోతున్నాయి. ఇంత అభివృద్ధి చెందిన సైన్సు ప్రపంచంలో దాదాపు రెండు పాటుగా విరుచుకుపడుతున్న కరోనని చూస్తూ ఉండడమే కానీ దానికి సరైన వైద్యం లేదు. గ్రహాల మీదికి క్షణాల్లో వెళుతున్నాం, గడ్డి పరకతో వింతలు చేస్తున్నాం, మా దేశం సైన్సు లో ముందు అంజలో ఉంది అని సంకలు గుద్దుకోవడం. వీడే చేశాడు వాడే చేశాడు అని నిందించడం తప్ప.. ఏ ఒక్క దేశం కరోనా వైరస్ ని చెక్ పెట్టడం లేదు. ఇంకా కొంత మంది ముందుకు వచ్చి కరోనా గురించి నిజాలు చెపితే వారికి శిక్షించడం లాంటి పనులు చేస్తుంది. ఏ ప్రభుత్వం అయినా.. కొంత మంది మేధావులు అయితే ఇంతకీ కరోనా అనేది ఉందా ? లేక ప్రజలను నాశనం చేయడానికే కార్పొరేట్ వ్యవస్థ ఈ పనికి పూనుకుండా అని మాట్లాడుతున్నారు.  వారి మాటలు వింటుంటే అప్పుడప్పున అది కూడా నిజమే కావచ్చు అనిపిస్తుంది. సరే ఇది అంత ఒక ఎత్తు ఐతే కరోనా వచ్చిందని చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరోనా టెస్ట్ చేయించి తనకు పాజిటివ్ వస్తుందేమో అని కొందరు చనిపోయారు. అలా హాస్పిటల్స్ లో చనిపోయిన వాళ్ళు చంపినా వాళ్ళు అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఇవి అన్ని ఒక రకం అయితే లాక్ డౌన్ టైంలో బయటికి వచ్చిన వాళ్ళను పోలీసులు కొట్టి చంపిన వాళ్ళు కూడా లేకపోలేదు. తాజాగా తమిళనాడు లో బయటికి వచ్చారని కొట్టి చంపారు పోలీసులు వివరాల్లోకి వెళితే..

మన దేశంలో కరోనా కారణంగా  పలు రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అదుపులోకి రావడంతో అక్కడక్కడా లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్నారు. అయితే, తమిళనాడులో కరోనా కేసులు ఇంకా అదుపులోకి రాకపోవడంతో అక్కడ ఇంకా నిర్భంధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే బయటకు వచ్చిన ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకుని చితకొట్టారు. అతను ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఘటన రాష్ట్రంలో పెను సంచలనం రేపింది. గతంలో చెన్నైలో మొబైల్ షాప్ ఓనర్ ని జయరాజు అతని కొడుకుని కర్ఫ్యూ టైం కి మించి 15 నిముషాలు షాప్ ఓపెన్ చేశాడని పోలీసులు పెద్ద రచ్చ చేసి చివరికి జయరాజును అతని కొడుకును కొట్టి చంపారు.. అది చాలా పెద్ద సంచలనం రేపింది. ఆ సంఘటన మరువక ముందే మరో ఘటన చోటుచేసుకుంది.   లాక్‌డౌన్ లో ఎవరూ బయటకు రాకూడదని అక్కడి ప్రభుత్వం గట్టి హెచ్చరికలు జారీ చేసింది. అయితే, మురుగేషన్ (40) అనే వ్యక్తి పనిమీద సేలం నుంచి ధర్మపురికి బయలుదేరాడు.

మార్గమధ్యలో ఎడప్పురి చెక్ పోస్టు వద్ద అతన్ని గమనించి పోలీసులు అడ్డుకున్నారు. బయటకు ఎందుకు వచ్చావని చితకబాదారు. కొట్టొద్దని మురుగేషన్ ఎంత ప్రాధేయపడ్డాడు.  అయినా పోలీసులు వినిపించుకోలేదు. దెబ్బ మీద దెబ్బలు కొట్టారు. చివరికి ఆ వ్యక్తి దెబ్బలకు తాళలేక చివరకు  మరణించాడు. విషయం తెలియడంతో స్టేట్ వైడ్ సంచలనం అవ్వగా.. పలువురు పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై ఆరా తీసిన ఉన్నతాధికారులు మురుగేషన్ మరణానికి కారణమైన ఎస్సై సహా మరో ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు. కాగా, మృతుడు మద్యం సేవించి తమతో వాదనకు దిగాడని, దీంతో తాము కొట్టాల్సి వచ్చిందని పోలీసులు ఆరోపించారు.

ప్రజా ఆరోగ్యం పట్టని ప్రభుత్వాలు ప్రజలపైనే వాళ్ళ ప్రతాపం చూపిస్తుంది. ఎన్నికల కోసం ప్రజలను పోగుచేసి మీటింగ్ పెట్టొచ్చు. ఆక్సిజన్ అందించకుండా ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు తీయొచ్చు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు కనీస అవసరాలు లేకుండా చేయొచ్చు. ఎదావిదిగా వైన్స్ లు నడపొచ్చు, చచ్చిపోయిన శవాన్ని తగల పెట్టడానికి అవకాశం లేకుండా చేయొచ్చు. కానీ ప్రజలు ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తే వారిపైన కేసులు, పెడ్దుతున్నరు. దేశద్రోహం ముద్ర వేస్తున్నారు. మాస్క్ లేకుంటే ఫైన్లు వేస్తున్నారు.. ఇదెక్కడి ప్రభుత్వాలు.. అందుకే ప్రజలు ఓట్లు వేసే ముందు ఆలోచించాలి. ప్రజల కోసం పని చేసే వారిని ఎన్నుకోవాలి.