అశ్లీల కాల్స్‌ పేరిట మెస్సెజ్‌.. చివరికి ఇలా.. 

ప్రజలు డబ్బులు సంపాదించడమే పనిగా పెట్టుకుంటున్నారు. అందుకు కస్టపడి పనిచేయడం వదిలేసి అడ్డదారిలో డబ్బు సందపాదించాలనుకున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువైతున్నాయి.  కాల్ గర్ల్స్‌ పేరిట మెసెజ్‌లు పంపడం, అశ్లీల వీడియోలను, ఫొటోలను కొంత మందికి  పంపించడం లాంటివి చేసి వల పన్నేవారు. దీంతోపాటు అశ్లీల వీడియో కాల్స్‌ చేయిస్తామంటూ రూ.300ల నుంచి రూ.5వేల వరకూ డిమాండ్‌ చేసేవారు. పాపం ఆ ముసుగు మాటున ఏంజరుగుతుందో తెలుసుకోలేని కొంత మంది పిచ్చి జనం డబ్బులు పంపించి మోసపోవడం జరుగుతుంది. అలాంటి ముఠా ఆటకట్టించారు ఏపీలోని కర్నూలు జిల్లా పోలీసులు. అశ్లీలమైన విడియోలను, ఫోటోలను పంపి ఆన్ లైన్ విడియో కాల్స్ చేయిస్తామని డబ్బు దండుకుంటున్న  ఇద్దరు కిలాడి వ్యక్తులను  అరెస్టు చేసినట్లు కర్నూలు వన్‌టౌన్‌ సీఐ కె. కళావెంకటరమణ తెలిపారు. నిందితులు మార్కెటింగ్ యాప్స్ వినియోగించుకుని సాధారణ ప్రజలకు కాల్ గర్ల్స్ సప్లయ్ చేస్తామని, అశ్లీల విడియో కాల్స్ చేయిస్తామని రూ.300 ల నుంచి రూ. 5,000 వరకు దండుకుంటున్నారని తెలిపారు. ఈ ముఠా పలు యాప్‌లను ఉపయోగించి.. ఒకేసారి 100 నుంచి 1000 మంది వరకు బల్క్ మేసేజ్‌లు పంపేవారని తెలిపారు. ఈ క్రమంలో కొంతమంది వీరి వలలో చిక్కుకొని అత్యధికంగా డబ్బులు చెల్లించేవారని తెలిపారు. ఈ విధంగా చాలామంది మోసపోయినట్లు విచారణలో తెలిసిందన్నారు. ఆ తర్వాత నిందితులు.. బాధితులను ఫోన్‌ ద్వారా భయపెడుతూ డబ్బులు వసూలు చేసేవారని పేర్కొన్నారు.

ఈ ఘటనలో పగిడ్యాల గ్రామానికి చెందిన తెలుగు జనార్ధన్, కర్నూలుకు చెందిన బెస్త ప్రవీణ్ కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు దాదాపు రెండేళ్ల నుంచి ఈ విధంగా మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.  పలువురి నుంచి అందిన సమాచారం మేరకు.. తమ బృందం వారిని పట్టుకున్నట్లు సీఐ తెలిపారు. ఇలా రోజుకు సుమారు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు సంపాదిస్తున్నట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఈ మేరకు నిందితులకు సంబంధించిన పలు బ్యాంక్ అకౌంట్లను గుర్తించి విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుల నుంచి 31 మొబైల్స్, మహేంద్ర కంపెనీ కారు, 1 స్కూటీ స్వాధీనం చేసుకున్నామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కళావెంకటరమణ అన్నారు. 

హైదరాబాద్ లో మరో ఘటన.. 

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని సరూర్ నగర్‌లో చందన నాగ రవిరాజా, చందన సునీత అలియాస్ అనూష అనే భార్యాభర్తలిద్దరూ గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు . పక్కా సమాచారం మేరకు వారిని సరూర్ నగర్, రాచకొండ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో జూన్ 15వ తేదీన పట్టుకున్నట్లు తెలిపారు. వారితో పాటు ఒక విటుడిని, బాధితురాలైన ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అనంతరం వారిని కోర్టు ఎదుట హాజరుపరచగా రిమాండ్ ఉత్తర్వులకు అనుగుణంగా జైలుకు పంపినట్లు పేర్కొన్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ దంపతులు యువతులకు ఉపాధి కల్పించే నెపంతో మాయమాటలు చెప్పి ఆపై బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపుతున్నారన్నారు.

కాలేజీకి వెళ్లే స్టూడెంట్లనే వీరు టార్గెట్‌గా పెట్టుకున్నారని, ఇలాంటి వారి మాయమాటలను నమ్మొద్దని సీపీ సూచించారు. కాగా ఈ దంపతులను శుక్రవారం చెర్లపల్లి, చంచల్ గూడ సెంట్రల్ జైళ్లకు తరలించినట్లు చెప్పారు. యువతుల అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోందన్నారు.