Latest News
ఫలితం తెలిసి జరుగుతున్న యుద్ధం-పోలవరం
posted on: Jul 11, 2014 9:30AM
.png)
ఈరోజు లోక్ సభలో పోలవరం ప్రాజెక్టు బిల్లుపై చర్చ జరగనుంది. బీజేపీ, తెదేపాలు బిల్లుకి మద్దతు ఇవ్వాలని తమ సభ్యులకు విప్ జారీ చేయడం గమనిస్తే ఎట్టి పరిస్థితుల్లో బిల్లును ఆమోదింపజేయాలని ధృడ నిశ్చయంతో ఉన్నట్లు అర్ధమవుతోంది. లోక్ సభలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉంది గనుక, తెరాస తదితర ప్రతిపక్షాలు ఎంత వ్యతిరేఖించినప్పట్టికీ, బిల్లు ఆమోదం పొందడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక రాజ్యసభలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు ఆధిక్యత ఉన్నప్పటికీ, గత యూపీయే ప్రభుత్వమే పోలవరం ప్రతిపాదన చేసింది గనుక అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ వేయబడిన అనేక పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించడం గమనించినట్లయితే, ఇప్పుడు కూడా రాష్ట్రపతి, పార్లమెంటు ఆమోదించబోయే పోలవరం బిల్లును తిరస్కరించే ఆలోచన చేయదనిస్పష్టం అవుతోంది. అంటే పోలవరం ప్రాజెక్టుకు ప్రతిపక్షాల నుండి ఎదురవుతున్న వ్యతిరేఖత వల్ల కొద్దిగా ఇబ్బందే తప్ప ఎటువంటి ఆటంకమూ ఉండదని స్పష్టమవుతోంది. ఈరోజు పోలవరంపై పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్దమే జరుగబోతోంది. కానీ ఆ యుద్ధంలో ఎవరు విజయం సాధించనున్నారో అందరికీ ముందే తెలిసి ఉన్నప్పటికీ యుద్ధం చేయడమే విశేషం.


.png)



