Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోదీతో మీటింగ్ కి… చిన్న డ్రస్సు వేసుకొచ్చిన పెద్ద పాప!
posted on: Jun 1, 2017 3:11PM

ఫేస్బుక్, ట్విట్టర్ లాంటివి వచ్చాక సెలబ్రిటీలు ఏం చేసినా న్యూసే అవుతుంది! ప్రియాంక జర్మనీలో ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవటం అలాగే పెద్ద బ్రేకింగ్ న్యూసైంది! అసలు ఇండియాలో హ్యాపీగా కలుసుకోక మన ప్రధానిని మరేదో దేశంలో కలుసుకోవటం మొదటి విడ్డూరం. పోనీ కలిస్తే కలిసింది అనుకుంటే… పిగ్గీ చాప్స్ చాలా నెలలుగా హాలీవుడ్ ప్రాజెక్ట్స్ కోసం విదేశాల్లో వుంటోంది! ఆ ఎఫెక్టేమో… కాస్త పొట్టి డ్రెస్ వేసుకుని పీఎం ముందుకి వచ్చింది. అంతేనా… కాలు మీద కాలేసుకుని ఆయనతో మాట్లాడింది! ఈ మీటింగ్ లో పెద్దగా చెప్పుకోటానికి ఇంపార్టెంట్ అప్ డేట్స్ ఏం లేవుగాని… పీసీ ఒక పీఎం ముందు ఇలా డ్రెస్సింగ్ చేసుకుని అలా కూర్చోవచ్చా అన్నదే పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది!
ప్రియాంక వేసుకున్న డ్రస్ గురించి మోదీగాని, బీజేపిగాని ఏం అనలేదు. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ జరిగిపోయింది. ఆమె డ్రస్, ఆమె వ్యవహారశైలి బాగోలేదని ట్రాల్స్ అల్లరి చేశారు. ఇక తాను కూడా వెనక్కి తగ్గేది లేదని డిసైడ్ అయిన ప్రియాంక చోప్రా … తల్లితో కలిసి పొట్టి డ్రస్సులు వేసుకున్న ఒక ఫోటో తీసి మళ్లీ సోషల్ మీడియాలో పెట్టింది! తల్లికూతుళ్ల కాళ్లు కనిపించేలా వున్న ఆ ఫోటోని మన సంప్రదాయవాద సోషల్ మీడియా సైనికులు విపరీతంగా ట్రెండింగ్ చేశారు! ఇక యథావిధిగా బాలీవుడ్లోని ఇతర నటీనటులు మా ప్రియాంక చోప్రా చేసింది చాలా గొప్ప పనంటూ వెనకేసుకొచ్చారు!
నిజానికి విదేశంలో వున్న ప్రధానితో సమావేశం అన్నప్పుడు ప్రియాంక కాస్త హుందాగా వస్తే బావుండేది. అలాగే, ఆమె చేసిందేదో ఘోరమైన అపరాధం అన్నట్టు సోషల్ మీడియా యుద్ధ వీరులు కూడా అల్లరి చేయకుంటే ఇంకా బావుండేది! నెగిటివ్ గా అయినా సరే.. ప్రస్తుతం తన బేవాచ్ రిలీజ్ అవబోతున్న సమయంలో పీసీ మాత్రం హ్యాపీగా పబ్లిసిటీ సంపాదించుకుంది! సోషల్ మీడియా వల్ల వచ్చిపడ్డ కొత్త ట్రెండ్ ఈ టీకప్పులో తుఫాన్ వివాదాలు!






