Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...మోడీ మళ్ళీ అణు పరీక్షలు చేయనున్నారా?
posted on: Jul 21, 2014 12:11PM
.jpg)
భారతదేశం అణు పరిజ్ఞానం గురించి ఆలోచించడానికే సాహసం చేయబోదన్న అభిప్రాయం ప్రపంచ దేశాలకు.. ముఖ్యంగా అమెరికా, చైనాలకు వున్న సమయంలో అటల్ బీహారి వాజ్‌పేయి ప్రభు్తవం పోఖ్రాన్‌లో విజయవంతంగా అణు పరీక్షలు జరిపించింది. ఈ సంఘటన అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ పరీక్షల తర్వాత భారతదేశం కూడా అణ్వస్త్ర సహిత దేశంగా ప్రపంచం ముందు సగర్వంగా నిలబడింది. ఈ పరిణామం అమెరికా, చైనా, పాకిస్థాన్ లాంటి దేశాలకు ఇండియాని చూస్తేనే వెన్నులో చలిపుట్టేలా చేసింది. ఇదిలా వుంటే, ఇటీవలే ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన భారతీయ జనతాపార్టీ నాయకుడు నరేంద్ర మోడీ దేశంలో అభివృద్ధికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో, దేశ భద్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తున్నారు. భారతదేశాన్ని ఇతర దేశాలు ఆషామాషీగా తీసుకోకూడదని ఆయన భావిస్తున్నారు. తాజాగా ఆయన సోమవారం నాడు భాభా ఆటమిక్ కేంద్రాన్ని సందర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి తరహాలోనే నరేంద్ర మోడీ కూడా మరోసారి అణు పరీక్షలు నిర్వహించే అవకాశాలు వున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత అణు సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటాల్సిన అవసరం వుంది. నరేంద్రమోడీ ఈ దిశగా అడుగులు వేస్తే బాగుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


.jpg)



