మహా రెబెల్స్ పై పిల్.. రాజ్ థాకరేతో షిండే ఫోన్ సంభాషణ!

ఒకే కుటుంబంలా వున్న‌వాళ్లు విడిపోకూడ‌దు. అయినా విడిపోతే వారి దారిలో వారు వుండాలి.  ఇది మామూలు ఇంటి గొడ‌వ‌ల‌యితే అలానే వుంటారు. కానీ రాజ‌కీయాల్లో అది అంత సుల‌భం కానేకాదు. అందునా మ‌హారాష్ట్ర రాజ‌కీయాల్లో ఇపుడు త‌లెత్తిన సంక్షోభ స‌మ‌యంలో అస‌లుకే కుద‌ర‌దు.  థాక్రే పాల‌నా విధానం బాగోలేద‌నే షిండే బ‌య‌ట‌ప‌డి, మ‌రికొంద‌రిని త‌న‌వేపు తిప్పుకుని తిరుగుబాటు ప్ర‌క టించి నానా ఇబ్బందులు పెడుతున్నారు. రాష్ట్రంలో, పార్టీలో నానా గంద‌ర‌గోళం ఏర్ప‌డింది. ప్రభుత్వం లో ఇలా గంద‌ర‌గోళం సృష్టించి పాల‌న‌కు అడ్డుప‌డిన రెబెల్స్ మీద ఆగ్ర‌హించి జ‌స్ట్  ఏడుగురు పౌరులు ముంబై హైకోర్టులో పిల్ వేసేరు.

 ఏదో అలిగి వెళ్ల‌వ‌చ్చుగాని ఇలా రాష్ట్ర‌ప‌రిస్థితులు, ప్ర‌భుత్వం న‌డ‌వ కుండా చేయ‌డం మంచిదికాద‌ని, థాక్రేతో సంప్ర‌దించి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకోవాల‌ని  మ‌ళ్లీ అన్న ద‌మ్ముల్లా క‌లిసిపోవాల‌ని, తిరిగి వ‌చ్చి  ప్ర‌భుత్వ‌, పార్టీ  కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని కోర్టు  ద్వారా  ఆ ఏడు గురు త‌మ పిల్ లో కోరారు. ప్ర‌జ‌లు ఇంత అమాయ‌కంగానే వుంటారు. ఎక్క‌డ‌యినా.  కానీ అధికారం లో వున్నవారు, తిరుగుబాటు బావుటా ఎత్తినవారు అంత అమాయ కులు కాద‌న్న‌ది ఈస‌రికే మ‌రాఠా  వారికి తెలిసే వుండాలి. అయినా ఏదో మ‌నోళ్లు మ‌న మాట ఇన‌క‌పోతారా అన్న అభిప్రాయంతో పిల్ వేసి వుంటా ర‌నే అనుకోవాలి. 
స‌మాజ సేవ‌లో త‌రించాల్సిన‌వారు ఈ విధంగా రాజ్య‌ధికారం కోసం విభేదించి ప్ర‌భుత్వాన్ని వ్య‌తిరేకించి దూరంగావ‌డం, సంక్షోభం సృష్టించ‌డం స్వార్ధ‌ప్ర‌యోజ‌న‌మే అవుతుంద‌ని పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అంతేగాక ప్ర‌స్తుతం అనేక‌మంది మంత్రులు విడిపోవ‌డంతో శివ‌సేన నాయ‌క‌త్వంలోని ఎం.వి.ఏ  ప్ర‌భు త్వం ఏ విధంగా స‌వ్యంగా పాల‌న సాగిస్తుందో, అందుకు ఎలాంటి వ్యూహాలు వున్న‌దీ స్ప‌ష్టం చేయా ల‌ని పిటిష‌న్‌లో ప్ర‌శ్నించారు.
 
ఏక్‌నాథ్ షిండే గ‌త వారం రోజులుగా శివ‌సేనా ప్ర‌భుత్వానికి ఎదురుతిరిగిన ఇత‌ర రెబెలియ‌న్స్‌తో గౌహ‌తీ లో వున్నారు. వీరే కాదు మ‌రో 50 మంది ఎమ్మెల్యేల మ‌ద్ద‌తు కూడా వుంద‌ని, మ‌రీ ముఖ్యంగా వారిలో 40 మంది శివ‌సేన‌వారే వారే వున్నార‌ని షిండే ధీమా వ్య‌క్తంచేశారు.  కాగా త‌న‌ను త‌న‌తో పాటు మ‌రో 15 మంది ఇత‌ర రెబెల్ లెజిస్లేట‌ర్ల‌పై అన‌ర్హ‌త వేటు వేస్తూ డిప్యూటీ స్పీక‌ర్ న‌ర‌హ‌రి జిర్వాల్ నోటీసు ఇవ్వ‌డం పై  షిండే సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. డిప్యూటీ స్పీక‌ర్ నోటీసు అనైతిక‌మ‌ని, రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని షిండే ఆరోపించారు. 

బావ కొంప‌కూల్చి  ఆయ‌న త‌మ్ముడిని  బాగున్నారా అని అడిగింద‌ట వెన‌క‌టి  ఒకామె. అలానే వుంది షిండే వ్య‌వ‌హారం. ఆదివారం షిండే  ఉద్ధ‌వ్ థాక్రే స‌మీప బంధువు రాజ్ థాక్రేతో రెండుసార్లు ఫోన్ చేసి మాట్లాడార‌ని మ‌హా రాష్ట్ర న‌వ‌నిర్మాణ్ సేన (ఎం ఎన్ ఎస్‌) పార్టీ నాయ‌కుడు ఒక‌రు తెలియ‌జేశారు. ప్ర‌స్తుత మ‌హారాష్ట్ర రాజ కీయ ప‌రిస్థితులు ఎలా వున్నాయి, రాజ్ ఆరోగ్యం ఎలా వుంద‌ని అడిగి తెలుసుకున్నార‌ట‌. ఎం ఎన్ ఎస్ పార్టీ అధినేత రాజ్ థాక్రే ఆదివార‌మే ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ సంగ‌తి తెలిసి షిండే  ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగిన‌ట్టు వార్త‌. శివ‌సేన నుంచి 2006లో విడిపోయిన రాజ్ ఎంఎన్ ఎస్ పేర సొంత దుకాణం పెట్టారు.  కాగా శివ‌సేన కి చెందిన 38 ఎమ్మ‌ల్యేల మ‌ద్ద‌తు త‌న‌కు వుంద‌ని అసెం బ్లీలో అస‌లు సేన గ్రూప్‌గా గెల‌వ‌డానికి వారి మ‌ద్ద‌తు స‌రిపోతుంద‌ని షిండే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.