వైసీపీకి బిగ్ షాక్‌.. జెడ్పీ ఛైర్‌ప‌ర్స‌న్‌పై హైకోర్టులో పిటిష‌న్‌..

అధికార పార్టీకి షాకుల మీద షాకులు. వైసీపీ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిత్యం ఏదో ఒక పిటిష‌న్ హైకోర్టులో దాఖ‌ల‌వుతూనే ఉంటుంది. స‌ర్కారు చేసే ప‌నులు కూడా అలా ఉంటున్నాయి మ‌రి. అధికారం చేతిలో ఉంది క‌దా అని.. ఇష్టారీతిన వ్య‌వ‌హ‌రిస్తోంది. నిబంధ‌న‌లు ప‌ట్టించుకోకుండా అడ్డ‌గోలు నియామ‌కాలు చేప‌డుతోంది. అందుకే, ప‌లు ఉదంతాల్లో న్యాయం కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యిస్తున్నారు ప‌లువురు. తాజాగా, ఇటీవ‌లే గుంటూరు జెడ్పీ ఛైర్‌ప‌ర్స‌న్‌గా ఎన్నికైన క్రిస్టినాకు వ్య‌తిరేకంగా హైకోర్టును ఆశ్ర‌యించారు ఓ మ‌హిళ‌. 

గుంటూరు జెడ్బీ ఛైర్‌ప‌ర్స‌న్‌ క్రిస్టినా ఎస్సీ కాదంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. తెనాలికి చెందిన సరళకుమారి అనే మహిళ కోర్టులో పిటిషన్ వేశారు. క్రిస్టినా తప్పుడు ధ్రువపత్రం సమర్పించారని కోర్టుకు తెలిపారు. ఈ విషయంపై గతంలోనే జిల్లా కలెక్టర్‌కూ ఫిర్యాదు చేసినా ఫ‌లితం లేద‌ని ఆరోపించారు. 

పిటిష‌న్‌పై స్పందించిన ఏపీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. అయితే, ఈ నెల 25నే గుంటూరు జిల్లా జెడ్పీ ఛైర్‌పర్స‌న్‌గా క్రిస్టినా ప్రమాణ స్వీకారం చేశారు. రెండు రోజులు గ‌డ‌వ‌గానే హైకోర్టులో అన‌ర్హ‌త‌ పిటిషన్ దాఖలు కావడం సంచ‌ల‌నంగా మారింది.