Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అభివృద్ధి ఆలోచనల్లో కేసీఆర్.. ఫైల్స్ చూసే తీరిక కూడా లేదు...
posted on: Sep 15, 2014 5:35PM

తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతగానో తపిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి ఆలోచనల్లో నిమగ్నమై వున్నారు. తెలంగాణ అభివృద్ధి ఆలోచనల్లో పూర్తిగా మునిగిపోయి వున్న ఆయన వంద రోజులుగా మేధోమథనం చేస్తున్నారు. అధికారులతో నిరంతరం సమావేశాలు ఏర్పాటు చేస్తూ ‘బంగారు తెలంగాణ’ సాధించడం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తమ్మీద తెలంగాణ ముఖ్యమంత్రిలో కనిపిస్తున్న కసిని చూస్తుంటే ఆయన తెలంగాణని ఎక్కడికో ఎవరికీ అందనంత ఎత్తుకి తీసుకెళ్ళేలా కనిపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టే ఏ పనైనా సరే ‘తెలంగాణ’ కోణంలో వుండాలని ఆయన భావిస్తున్నారు. ఈ విషయంలో ఎంతో అకుంఠిత దీక్షతో పనిచేస్తున్న ఆయనకు పాపం తన కార్యాలయానికి వచ్చే ఫైళ్ళను చూసే తీరిక కూడా వుండటం లేదు. దానివల్ల దాదాపు వెయ్యి కీలక ఫైళ్ళు పెండింగ్ పడిపోయాయని తెలుస్తోంది. వెయ్యి ఫైళ్ళు పెండింగ్‌లో వుండటం అనేది మామూలు విషయం కాదు. అయినప్పటికీ ఏదో రోజు ఆయన పెండింగ్ ఫైళ్ళని క్లియర్ చేసే పనిలో పడతారన్న ఆశాభావం ప్రభుత్వ అధికారులలో వ్యక్తమవుతోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టే ఏ పని అయినా ‘తెలంగాణ’ కోణంలో వుండాలని భావిస్తున్న నేపథ్యంలో, తెలంగాణ కోణానికి సంబంధించిన విధి విధానాలను ఇంకా ఖరారు చేయాల్సి వుంది. అవి ఖరారయ్యాక ఫైల్స్ అన్నీ క్లియర్ అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. ఎందుకంటే, ప్రభుత్వ విధానం ‘ఇదీ’ అని క్లియర్ అయ్యే వరకూ ఫైళ్ళను క్లియర్ చేయకూడదని కేసీఆర్ భావిస్తున్నారని అనిపిస్తోంది. ప్రభుత్వ విధానం విషయంలో క్లారిటీ వస్తే, పెండింగ్ వున్న ఫైళ్ళను ఆ విధానానికి అనుగుణంగా క్లియర్ చేసేయవచ్చన్నది కేసీఆర్ ఆలోచన అని తెలుస్తోంది. సీఎం గారి ఆలోచన ఎలా వున్నా, పెండింగ్‌లో వున్న ఫైల్స్ ఎప్పుడు క్లియర్ అవుతాయో తెలియకపోయినా కేసీఆర్ ప్రభుత్వం భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించగలదన్న నమ్మకం మాత్రం ప్రజల్లో, అధికారుల్లో బలంగా వుంది.



.jpg)


