Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జగన్ పెద్దిరెడ్డినీ ముంచేశారా?.. స్వర్ణలత సుప్రీంకు ఎందుకు వెళ్లారు?
posted on: Mar 25, 2026 4:56PM
.webp)
జగన్ హయాంలో ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినీ జగన్ వదల కుండా ముంచేశారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్ హయాంలో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఓ వెలుగువెలిగిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
తాను చక్రం తిప్పిన ప్రభుత్వ హయాంలోనే తన కుటుంబానికి చెందిన పీఎల్ఆర్ సంస్థకు రావాల్సిన బకాయిల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ బకాయిల కోసం ఆయన భార్య ఏకంగా సర్వోన్నత న్యాయస్ధానాన్నే ఆశ్రయించారు. అయితే అక్కడ ఆమెకు చుక్కెదురైంది. జగన్ హయాంలో చేపట్టిన రోడ్డు పనులకు సంబంధించిన బకాయిల చెల్లింపుల కోసం పెద్ది రెడ్డి ఇప్పుడు న్యాయపోరాటం చేస్తున్నారు. భార్య పేరుతో సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
చిత్తూరు జిల్లాలో తమ పీఎల్ఆర్ కంపెనీ చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన బకాయిలు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. అయితే న్యాయమూర్తి జస్టిస్ దిపాంకర్ దత్తా నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసం ఈ విషయంలో తాము నేరుగా జోక్యం చేసుకోబోమని విస్పష్టంగా పేర్కొంది. హైకోర్టును ఆశ్రయించాలని స్పష్టం చేసింది. దీంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత తన పిటిషన్ ను ఉప సంహరించుకున్నారు.
నిజానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తరువాత పిఎల్ఆర్ కంపెనీ చేపట్టిన పనులను నిలిపివేసింది. గత ప్రభుత్వ హయాంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన పనులపై సమీక్షలు చేస్తోంది. అంటే పెద్దిరెడ్డి ఇప్పుడు అడుగుతున్న బకాయిలన్నీ జగన్ హయాంలో చేసిన పనులకు సంబంధించినవే. అంటే జగన్ తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న పెద్దిరెడ్డికి కూడా తన హయాంలో బిల్లులు చెల్లించలేదని తేటతెల్లమౌతోంది.
ఎన్నికల సమయంలో పార్టీ కోసం భారీగా ఖర్చు చేసిన పెద్దిరెడ్డికి సొంత ప్రభుత్వం నుంచే నిధులు అందలేదన్నమాట. ఇక ప్రస్తుతానికి వస్తే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం జగన్ హయాంలో అడ్డగోలుగా కాంట్రాక్టులు దక్కించుకున్న పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నది. పనులకు సంబంధించి కాంట్రాక్టు నిబంధనల ప్రకారమే ఇచ్చారా? ఆ పనుల నాణ్యత సరిగా ఉందా.. అన్న విషయంలో కచ్చితంగా పరిశీలించి పరిష్కరిస్తోంది. దీంతో బిల్లుల కోసం పెద్దరెడ్డి కుటుంబం అనివార్యంగా కోర్టుకెక్కి గత వైసీపీ ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని చెప్పకనే చెబుతున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు ఇచ్చే విషయంలో చొరవ తీసుకోని జగన్ ను నిలదీయాల్సింది పోయి.. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్న జగన్ రెడ్డిని చూసి వైసీపీ వర్గాలే జాలిపడుతున్న పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం పెద్దిరెడ్డి కంపెనీ చేపట్టిన పనులపై విచారణకు ఆదేశిస్తే ఆయన కుటుంబం మరిన్ని చిక్కులను ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుందని పరిశీలకులు అంటున్నారు.






