Latest News

హిందూ మహిళగా భర్తకు వీర తిలకం దిద్దిన అన్నా

posted on: Jan 22, 2018 11:41AM

హిందూ సాంప్రదాయంలో భర్త ఎక్కడికైన వెళుతున్నప్పుడు భార్య మంగళహారతి ఇచ్చి.. వీరతిలకం దిద్ది.. ఎదురురావడం తరతరాలుగా వస్తోంది. పాశ్చాత్య సంస్కతి భారతీయతపై ఎంతగా ప్రభావం చూపిస్తున్పప్పటికి భారతీయులు తమ మూలాలు మరిచిపోవడం లేదు అనడానికి నిత్యం ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అయితే పరాయి దేశానికి చెందిన మహిళకు భారతీయ సాంప్రదాయం గురించి తేలియడం.. తెలిసినా ఆచరించడం చాలా కష్టం. అయితే ఈ విషయంలో సినీనటుడు పవన్‌కళ్యాణ్ భార్య అన్నాలెజ్‌నోవాకి మార్కులు వేయొచ్చు.

 

పవన్ భార్య అన్నాలెజ్‌నోవా ఉక్రెయిన్‌కు చెందిన మహిళ. ఆమెకు హిందూ సాంప్రదాయాల గురించి అవగాహన తక్కువ. అయితే మూడు రోజుల పాటు తెలంగాణలోని మూడు జిల్లాల్లో పర్యటించేందుకు పవన్ నిర్ణయించారు. ఇవాళ ఉదయం యాత్రకు బయలుదేరే ముందు భారతీయ సాంప్రదాయాల గురించి పెద్దగా అనుభవం లేకపోయిన్పటికీ.. భర్తకు మంగళ హారతీ ఇచ్చి.. వీరతిలకం దిద్దారు. అలాగే జనసేనాని ఎక్కబోతున్న కారుకు దిష్టి తీసి కొబ్బరికాయ కొట్టారు..

 

అయితే కొబ్బరి కాయను కారు చుట్టూ ఎలా తిప్పాలి..? ఎలా కొట్టాలన్న దానిపై పవన్ ఆమెకు సైగలు చేశారు. అన్నా కొబ్బరికాయ తిప్పుతుంటే  పవన్.. ముసి ముసి నవ్వులతో చూస్తూ నిలబడ్డారు. దిష్టి తీసిన తర్వాత ఆమె కొబ్బరికాయను నేలకేసి కొట్టగా.. అది పగల్లేదు.  దీంతో నవ్వుకున్న పవర్‌స్టార్ మరోసారి కొట్టమని సూచించారు. ఈసారి ఆమె గట్టిగా కొట్టడంతో అది పగిలింది.. ఈ తతంగమంతా మీడియాకు చిక్కడంతో.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...