Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఏపీలోనే దిక్కు లేదు.. ఇక్కడేం సీఎం అవుతాను?
posted on: Jun 3, 2026 10:31AM
.webp)
ఈ కామెంట్లను ఎలా అర్ధం చేసుకోవాలి? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. కావాలంటే చూడండి.. పవన్ ఇందులో చాలా పెద్ద వ్యూహరచన సిద్ధం చేశారనే చెప్పాలంటారు మరి కొందరు. ఈ మాటలోంచి ఆయన ఓ రెండు వర్గాల వారిని గట్టిగానే లాగిపెట్టి కొట్టారు. అందులో మొదటిది తన కులం కాగా, రెండోది అభిమానగణం. ఆంధ్రప్రదేశ్ లో అతి పెద్ద సామాజిక వర్గంగా ఉన్న పవన్ సామాజిక వర్గం, ఆయన్ను పెద్దగా ఆదరించింది లేదు. డైరెక్టు ఎలక్షన్లలో పోటీ చేసిన తొలి ఎన్నికల్లో రెండు చోట్ల ఘోరంగా ఓడిపోయారాయన. నిజంగా తనకు కులం బంలం ఉండి ఉంటే, రెండు చోట్ల గెలిచేవాడిని కదా? అని ప్రశ్నిస్తారు పవన్. ఫైనల్ గా 2024 ఎన్నికల్లో గెలిస్తే.. అది కూటమి ఓటు బ్యాంకు వల్ల. ఇక రెండోది ఆయన అభిమానగణం రచ్చ రావిడి చేయడానికి తప్ప అది ఓటు బ్యాంకుగా మారిందే లేదు. ఈ విషయంలోనూ ఆయనకో క్లారిటీ ఉంది. వాళ్లేదో క్రేజ్ కొద్దీ గొడవలకు పాల్పడ్డం తప్ప.. ఆయనకంటూ ఇప్పటి వరకూ ఓటర్లుగా మారి వర్క్ చేసిందే లేదన్న నిశ్చితాభిప్రాయం పవన్ కల్యాణ్ ది.
ఇలా వీరిని టార్గెట్ చేస్తూనే ఇటు తెలంగాణలో తనకు ఏపీలో అంతంత మాత్రం బలం ఉందంటూ.. తనను తానొక లైట్ పవర్డ్ పొలిటీషియన్ గా చెప్పుకోవడం అనేదొక ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇలా చేయడం వల్ల పవన్ కళ్యాణ్ పెద్ద పోటీ కాదులే అన్న తలంపు ఇక్కడ రాజకీయనాయకులకు వస్తుందన్నది ఆయన వ్యూహం కావచ్చు. అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఒక కొత్త పాయింట్ లేవదీశారు. అదేంటంటే పవన్ కళ్యాణ్, అమిత్ షాను కలిసినపుడు.. తెలంగాణ కూటమి వ్యవహారం మాట్లాడి ఉంటారనీ, దాని ప్రభావమే ఆయన ఇక్కడ నవ నిర్మాణ సభ ఏర్పాటు అన్నారాయన.
ఇదంతా ఇలా ఉంటే పవన్ హిమ్ సెల్ఫ్.. ఇక్కడ టీడీపీ తమతో కలుస్తుందో లేదో కూడా తమకు తెలీదని అన్నారు. అంతే కాదు.. బీజేపీ విషయంలోనూ ఎలాంటి క్లారిటీ లేనట్టే మాట్లాడారు. కానీ అనిరుధ్ మాటలను బట్టీ చూస్తే.. తెలంగాణలో బీఆర్ఎస్- బీజేపీ- జనసేన కూటమి కట్టి.. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలు, ఆపై రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలసి పోరాడనున్నట్టు తెలుస్తోంది.
అంటే ఏపీలో కూటమిలోని ప్రధాన పార్టీ తెలంగాణలో లేదన్న సంకేతాలను ఇచ్చారు పవన్. ఆపై తమతో ఎవరు కూటమి కట్టినా కట్టకపోయినా జీహెచ్ఎంసీ నుంచి మొదలు పెడితే.. తెలంగాణలో అన్ని ఎన్నికల్లోనూ తాము పాల్గొంటామని గ్లాసు బద్దలు కొట్టేశారు పవన్ కళ్యాణ్. దానికి తోడు గోదావరి నదితో తనను తాను పోల్చుకున్నారు. ఎక్కడో పుట్టిన గోదావరి తెలంగాణలోనూ ప్రవహించడం లేదా? తాను కూడా అంతే అన్నారాయన. దానికి తోడు పుష్కర కాలం కిందట ఆంధ్రలో రాజకీయాలు చేయడానికి గానూ తెలంగాణ లో పుట్టిందాయన పార్టీ జనసేన. అచ్చం ఆయనలాగే.
ఎక్కడో ఏపీలోని బాపట్లలో పుట్టి- నెల్లూరులో చదివి- చెన్నైలో ఎదిగి- హైదరాబాద్ కి వచ్చి పలు సినిమాల్లో నటించి.. తిరిగి రాజకీయాల్లోకి ప్రవేశించి.. ఆపై ఎన్నో వైఫల్యాలను ఎదుర్కుని.. అటు పిమ్మట గత ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తో గెలిచిన పవన్ సేన.. దేశ వ్యాప్తంగా విస్తరించడానికి ఎన్నో యత్నాలు చేస్తూనే ఉంది.. ఇటీవల కేరళలో కూడా తమ పార్టీని ఏర్పాటు చేయాలని చూసింది. అలాంటి జనసేనాని పవన్ ఏపీలో తనకు సీఎం అయ్యే దిక్కులేదనడమేంటి? ఇక్కడ అంటే తెలంగాణలో సీఎం కావడం కూడానా? అనడంలో తాత్పర్యమేంటి? అన్న ప్రశ్నకు ఆస్కారమేర్పడుతోంది.
అయితే పవన్ ఇలా లైటర్ వాన్ డైలాగ్స్ కొడుతూ.. జనాన్ని ఒకానొక గందరగోళంలో పెడుతూనే.. తన ప్రస్ధానం కొనసాగిస్తూ వస్తారనీ.. అదాయన రాజకీయ శైలిగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలా అంటూనే ఆయన ఇప్పటి వరకూ ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కాగలిగారనీ.. ఆపై ఆయన టార్గెట్ సీఎం కూడా అయి ఉండొచ్చనీ.. ఏమో కాలం ధర్మ కలిసి వస్తే- వచ్చే రోజుల్లో ఆయన తెలంగాణకు సీఎం అయినా అవుతారనీ అంటారు కొందరు. ఏమో గుర్రం ఎగురావచ్చనే ఈ కాన్సెప్ట్ లో భాగంగా.. పవన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారో చూడాలి మరి.






