పవన్ కళ్యాణ్ స్పీచ్ హైలైట్స్-1

 

కేసీఆర్ ఎకరా పొలానికి కోటి రూపాయలు ఆదాయం ఏవిధంగా సంపాదిస్తున్నారో అదేవిధంగా తెలంగాణా రైతన్నలకి కూడా సంపాదించుకొనేలా చేయగలిగితే నేను కూడా ఆయనకే జై కొడతాను.

 

కేసీఆర్ కుమార్తె కవిత నేను తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని కోరినట్లు విన్నాను. నేను ప్రేమించే నా తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పమని అడిగేందుకు నువ్వెవరు? వాళ్ళు నావాళ్ళు. నా వాళ్ళకి నేను క్షమాపణలు చెప్పమని ఎవరో సలాహా ఈయడం ఏమిటి? నువ్వు నా చెల్లిలాంటి దానివి. ఒక అన్నగా నీ ఆవేదనను అర్ధం చేసుకోగలను. కానీ ఇటువంటి సలహాలు నీ నుండి నేను కోరుకోవడం లేదు. నువ్వు విదేశాల నుండి ఉద్యమాల కోసం పోగేసిన డబ్బుకు జమాఖర్చుల లెక్కలున్నాయా?

 

స్త్రీల మీద అనేక ఏళ్లుగా అత్యాచారాలు జరుగుతున్నపటికీ నిర్భయ కేసు తరువాతనే మెలుకువ వచ్చిందా? అంతవరకు కళ్ళు మూసుకుపోయాయా మీకు?

 

కులం కోసం, మతం కోసం కొట్టుకొని చచ్చిపోయే వారిని చూసి ఉండవచ్చేమో కానీ దేశం కోసం చచ్చిపోవాలనుకొన్న నాలాంటి పిచ్చివాడిని ఎవరూ చూసుండరేమో... దేశ సమగ్రతకు భంగం కలిగించే వాళ్ళ తాట తీస్తా.

 

రాజకీయ జంపర్స్, బఫూన్ గాళ్ళకి నా పార్టీలో స్థానం లేదు.

 

కాంగ్రెస్ పార్టీ హటావ్..దేశ్ కొ బచావ్..

Online Jyotish
Tone Academy
KidsOne Telugu