అన్నపట్ల అదే అభిమానం గౌరవం...
posted on Mar 15, 2014 9:20AM
.gif)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...ఎవరి అంచనాలకు అందనంత ఎత్తులో...అభిమానుల అంచనాలను నిజం చేస్తూ ప్రసంగించి, అందరి నోళ్లకు, బుర్రలకు పని కల్పించారు. తన సభకు అడ్డంకులు సృష్టించిన అన్న చిరంజీవిని ఏకి పారేస్తారని రాజకీయ నాయకులు భావిస్తే, అభిమానులు మాత్రం ఆయన ఆ పని ఎన్నడూ చేయడనే బలంగా నమ్మారు. వారూహించినట్లే తన ప్రసంగం మొదట్లోనే అన్నయ్య చిరంజీవి పట్ల అపారమయిన ప్రేమ, అభిమానం, తనకు తండ్రి వంటివాడు అని చెప్పుకొని ఆయన పట్ల హనుమంతుడిలా భక్తి ప్రదర్శించడంతో పవన్ అభిమానులే కాదు చిరంజీవి అభిమానులు, ప్రజలు కూడా ఆయనను హర్షించాకుండా ఉండలేక పోయారు.
పవన్ నిశిత దృష్టి నుండి జైరామ్ రమేష్ తన అన్నయ్యకు వ్యతిరేఖంగా చేసిన వ్యాఖలు సైతం తప్పించుకాకపోవడం గమనిస్తే ఆయన ఎంత నిశితంగా రాజకీయాలను పరిశీలిస్తున్నారో అర్ధమవుతుంది. కేంద్రమంత్రి అయిన జైరామ్ రమేష్, తనతోటి కేంద్రమంత్రి అయిన చిరంజీవి గురించి అనుచితంగా మాట్లాడితే, ఆయన తమ్ముడిగా చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వల్లనే తాను తను ప్రేమించే, అభిమానించే అన్నకు వ్యతిరేఖంగా పోరాడే దుస్థితి దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేసారు.
తమ్ముడి ఈ ప్రసంగం విన్న తరువాతయినా చిరంజీవిలో పశ్చాతాపం కలిగితే పవన్ తన పోరాటంలో తొలి విజయం సాధించినట్లే. కానీ చిరంజీవి వంటి పదవీ లాలసుడిలో అంత త్వరగా మార్పు ఆశించడం అత్యసే అవుతుంది.