హేతురహిత వ్యాఖ్యలతో పిచ్చెక్కిస్తున్న పవన్ కల్యాణ్?!

posted on: Nov 27, 2025 3:48PM

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌లి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు ట్రోల్ అవుతున్నాయి. హేతు రహితంగా  చేస్తున్న వ్యాఖ్యలతో ఆయన నెటిజన్లకు అడ్డంగా దొరికిపోతున్నారు.  మొన్నా మ‌ధ్య ఎర్ర‌చంద‌నం చెట్ల విష‌యంలో ఆయ‌న చేసిన వ్యాఖ్యలు వివాదానికి సైతం తావిచ్చాయి.  ఎర్ర‌చంద‌నం  చెట్ల‌కూ వెంక‌టేశ్వ‌ర‌స్వామికి అయిన గాయానికీ సంబంధం లేదు. వెంక‌న్న ర‌క్తంతో త‌డవ‌డం వ‌ల్లనే  ఎర్ర‌చంద‌నం చెట్ల‌కు ఆ ఎర్ర‌ద‌నం వచ్చిందన్నట్లుగా చేసిన ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ శాస్త్రీయ కరాణాలను వివరించారు కొందరు హేతువాదులు. ఇక తాజాగా ఆయన కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి తెలంగాణ వాళ్ల దిష్టి తగలడమే కారణమన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలూ వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున విమర్శలకు తావిచ్చాయి.  

 ఉప ముఖ్య‌మంత్రి  స్థానంలో ఉండి  హేతురహితంగా ఆయన వ్యాఖ్యలు చేయడం సరికాదన్న మాట జనసైనికుల నుంచే వస్తున్నది. పవన్ కల్యాణ్ ఇటువంటి కామెంట్లు చేయడమేంటన్న విస్మయం రాజకీయవర్గాల్లో వ్యక్తం అవుతోంది.  అభివృద్ధి, సంక్షేమం విషయంలో ప్రజా మన్ననలు అందుకునేలా వ్యవహరిస్తున్న ఆయన.. ఎర్రచందనానికి వేంకటేశ్వరస్వామి గాయానికీ ముడిపెట్టడం.. అలాగే కోనసీమలో కొబ్బరికాయల దిగుబడి తగ్గడానికి పొరుగురాష్ట్రం దిష్టి తగలడమే కారణమని అర్ధం వచ్చేలా మాట్లాడటం ఆయన స్థాయికి తగినట్లుగా లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.  

google-ad-img
    Related Sigment News
    • Loading...