Latest News

కేసీఆర్ పై పవన్ పగ తీర్చుకున్నాడా...?

posted on: Jan 25, 2018 3:06PM

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఇప్పటికీ ముడేళ్లు అవుతున్నా గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. కానీ ఈ సారి మాత్రం ప్రత్యక్షంగా రాజకీయ బరిలోకి దిగుతున్నారు. ఇక రాజకీయాలు అన్నప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్. అలాగే ఎప్పుడైతే పవన్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడైతే అనుకున్నారో.. అప్పటినుండి ఇక పవన్ పై కూడా విమర్శలు మొదలుపెట్టారు. అందులో పవన్ కు ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. అలాంటి పవన్ జనంలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది. అందుకే ఆయనపై కాస్త ఘాటుగానే కామెంట్లు చేస్తున్నారు.

 

అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి పనికి రాడని... రాజకీయాలు వేస్ట్ అని.. పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా.. ఎలాంటి దిశా నిర్దేశం లేదు.. ఒక క్లారిటీ లేదు... అబ్బో ఇలా ఒకటా... రెండా.. ఎన్నో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తెలంగాణలో పర్యటన కోసం వచ్చిన పవన్ ను అయితే కాంగ్రెస్ ఏకీ పారేసింది. అంతేకాదు ఒకప్పుడు పవన్ తెలంగాణ గురించి ఏం మాట్లాడారు.. ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు.... అని తేడా చూపిస్తూ మరీ... విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేనా.. కేసీఆర్ ను పొగడటంపై కూడా కాంగ్రెస్ విరుచుకుపడుతుంది.

 

అయితే ఇక్కడే కొంతమంది పవన్ తెలివిని గురించి మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు శకుని రీతిలోపవన్, కెసిఆర్ మీద పగ తీర్చుకున్నాడని అనుకుంటున్నారు. రాష్ట్ర విభజన సమయంలో, అంతకు ముందు కెసిఆర్ , పవన్ ల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరిగిందో అందరికీ తెలుసు. దాంతో పవన్ తెలంగాణకు వ్యతిరేకి అని జనాల్లోకి తీసుకెళ్లారు. ఇక అసలే ఫుల్ ఫైర్ మీద ఉన్న తెలంగాణ వాదులు దీన్ని నమ్మారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి పవన్ ఏపీని వదిలేసి మరీ.. తెలంగాణలో పర్యటన మొదలుపెట్టేసరికి అందరూ షాకయ్యారు. ఇక ఈ పర్యటనలో పవన్ కేసీఆర్ పై ఒక్క విమర్శ కూడా చేయలేదు. తనపాటికి తాను వచ్చి.. ఏదో సమావేశాలు పెట్టుకొని.. తన కార్యకర్తలతో ముచ్చటించి వెళ్లిపోయారు. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది అంటున్నారు. ఏదో పైకి ఈ పర్యటన కెసిఆర్ కి అనుకూలంగా అనిపిస్తోంది... కానీ పవన్ మాటల వల్ల అయితేనేమి, కాంగ్రెస్ ప్రచారం వల్ల గానీ జనసేన మీద కెసిఆర్ అనుకూల ముద్ర పడింది అంటున్నారు. కానీ నిజానికి పవన్ పర్యటనతో తెలంగాణ వ్యతిరేకులకు కెసిఆర్ పెద్ద పీట వేస్తున్నారన్న అభిప్రాయం కలిగింది. నిజానికి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సిన అవసరం పవన్ కు లేదు. ఈవిషయం పవన్ కు కూడా తెలుసు. అయినా పనిగట్టుకుని పర్యటన చేసి కెసిఆర్ వ్యతిరేకులకు తిరుగులేని అస్త్రం అందించారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ శకుని టైపు లో కెసిఆర్ మీద పగ తీర్చుకున్నాడని అంటున్నారు.  మరి ఇందులో ఎంత నిజముందో... ఆ విషయం పవన్ కే ఎరుక...

google-ad-img
    Related Sigment News
    • Loading...