Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ వివాదంలోకి మరో హీరోయిన్.. అవసరమా..
posted on: Jan 9, 2018 3:31PM

పవన్ కళ్యాణ్, కత్తి మహేశ్ వార్ లో నటి పూనమ్ కౌర్ వచ్చి ఇప్పుడు ఇరుక్కుపోయిన సంగతి తెలిసిందే కదా. కత్తి మహేశ్ పవన్ పై చేస్తున్న విమర్శలకు స్పందించిన పూనమ్ కౌర్ ఆయనపై పరోక్షంగా ట్వీట్లు చేసింది. మరి కత్తి మహేశ్ ఊరుకుంటాడా... ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి పూనమ్ వ్యక్తిగత జీవితాన్నే అందరి ముందు పెట్టాడు. పూనమ్ కు ఆరు ప్రశ్నలు వేస్తున్నానని.. దానికి సమాధానం చెప్పాలని పబ్లిక్ గా డిమాండ్ చేశాడు. దీంతో అనవసరంగా ఈ మ్యాటర్లోకి వచ్చానని తెలుసుకున్న పూనమ్.. పవన్ కు తనను కాపాడాలని ట్వీట్లు చేసింది. ట్వీట్లు చేస్తే చేసింది.. చేసిన కొద్ది నిమిషాల్లోనే మళ్లీ ట్వీట్లు డిలీట్ అని లేనిపోని అనుమానాలు లేవనెత్తింది. మరోవైపు కత్తి మహేశ్ ప్రశ్నలపై పూనమ్ కౌర్ సోదరుడు శ్వామ్ సింగ్ స్పందించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆధారాలు ఉంటే బయటపెట్టమని సవాల్ విసిరాడు. ఇక ఏకంగా వ్యక్తిగత విషయాలే బయటకు వస్తుండటంతో ఈ నెల 15 వరకూ సైలెంట్ గా ఉండమని పవన్ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చారు. దీంతో 15న ఏం జరగబోతుందా అని అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మరో హీరోయిన్ తెరపైకి వచ్చింది.. సంజన పవన్ కు మద్దతుగా ట్వీట్ చేసింది. పేరు ప్రఖ్యాతులను సంపాదించుకోవడం కోసం కొంత మంది మంచి మార్గాలను వెతుక్కుంటారని, కష్టపడి పని చేస్తారని చెప్పింది. మరికొందరేమో గౌరవంగా, సక్సెస్ ఫుల్ గా ఉన్న వ్యక్తులను కించపరుస్తూ పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటారని అంది. 'పవర్ సర్... మేమంతా మీతోనే ఉన్నాం' అంటూ ట్వీట్ చేసింది. మరి ఇప్పటికే కత్తికి వ్యతిరేకంగా ట్వీట్ చేసి పూనం కౌర్ వివాదంలో చిక్కుకుంది. ఆ తరువాత కళ్లు తెరిచింది. అన్నితెలిసి ఇప్పుడు సంజన కూడా కత్తికి వ్యతిరేకంగా ట్వీట్ చేసింది. మరి కత్తి ఈ ట్వీట్ చూసి ఊరుకుంటాడా.. పూనమ్ కౌర్ కు చేసినట్టే.. సంజన వ్యక్తిగత విషయాలు తీసుకొచ్చి మళ్లీ మీడియాలో పెడతాడా..? చూద్దాం ఏం జరుగుతుందో...






