Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ గుండు స్టోరీపై క్లారిటీ ఇచ్చిన పరిటాల సునీత....
posted on: Dec 11, 2017 2:09PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్... తన గుండు స్టోరీ గురించి చెప్పినప్పటినుండి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే కదా. ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించిన పవన్ కళ్యాణ్.. పలు సమావేశాల్లో పాల్గొన్నారు. జనసేన కార్యకర్తలను మీట్ అయ్యారు. అయితే ఈసారి మాత్రం పవన్ చేసిన ప్రసంగాలు మాత్రం ఏపీ రాజకీయాల్లో వేడిని పుట్టించాయి. ఎప్పటినుండో తన మనుసులో దాగివున్న కొన్ని నిజాలను ఇప్పుడు అందరిముందు చెప్పి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దీనిలో భాగంగానే పవన్ తనకు పరిటాల గుండు కొట్టించాడని కొన్నేళ్ల క్రితం వచ్చిన వార్తలపై స్పందించి అసలు ఏం జరిగిందో చెప్పాడు. అప్పుడెప్పుడో జానీ సినిమా అప్పుడు తనకు చిరాకు వేసి గుండు కొట్టించుకున్నానని... అయితే పరిటాల రవి నాకు గుండు కొట్టించాడని ప్రచారం జరిగింది.. నేనెప్పుడు పట్టించుకోలేదు.. వదిలేశాను అని అన్నాడు. అంతేకాదు.. ఒక వేళ పరిటాల రవి గుండు కొట్టిస్తే నేను ఊరుకుంటానా.. నేనేమన్నా వాజమ్మనా అంటూ ఎప్పుడో రేగిపోయి,వదిలేసిన తేనే తుట్టుని మళ్ళీ కదిపాడు. ఇక పవన్ చెప్పిన గుండు స్టోరీ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇక పవన్ చెప్పిన గుండు స్టోరీపై పరిటాల రవి భార్య పరిటాల సునీత స్పందిచారు. తన భర్తకు.. పవన్ కల్యాణ్ కూ సంబంధమే లేదని.. ఈ విషయంలో పవన్ నిజమే చెప్పారని అన్నారు. పవన్ కు గుండు కొట్టించే అవసరం పరిటాల రవి గారికి లేదు..అయినా తన భర్త అంత మూర్ఖుడు కాదని ప్రజలు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు అని తెలిపారు..రాష్ట్ర అభివృద్ధి కోసం పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారని చెప్పారు. మొత్తానికి ఎప్పటినుండో దాగివున్న ఓ నిజానికి అటు పవన్.. ఇటు మంత్రి సునీత గారు క్లారిటీ ఇచ్చారు. మరి ఇన్నాళ్లు పరిటాల రవి చేతిలో గుండు కొట్టింకున్నాడు అన్న విషయంలో.. ఇకనుండి పవన్ పై విమర్శలు గుప్పించాలంటే ఆలోచించాల్సిందే...


.jpg)



