Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ ‘ఇజం’ అర్ధం కాలేదు: వర్మ
posted on: Apr 2, 2014 1:11PM

మీరు పుస్తకాల ప్రియులా? పుస్తకాల పురుగులా? మార్కెట్లోకి ఏ పుస్తకం రిలీజైనా కొనుక్కునో, అద్దెకి తెచ్చుకునే మంచి అలవాటు మీకు వుందా? అయితే మీకు హెచ్చరిక.. కొత్తగా మార్కెట్లోకి వచ్చింది కదా.. బాగాప్రచారం కూడా వచ్చింది కదా.. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి ఆలోచనలు అందులో వుంటాయి కదా అని ‘ఇజం’ పుస్తకాన్ని చదివే సాహసాన్ని చేయకండి. ఎందుకంటే ఈ పుస్తకాన్ని చదివిన అనేకమంది ఇప్పటికే ఎందుకు చదివాం దేవుడా అని తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది.
మిగతావాళ్ళ సంగతి అలా వుంటే, పవన్ కళ్యాణ్‌ని ఎంతగానో అభిమానించే రామ్ గోపాల్ వర్మకి కూడా ఈ పుస్తకంలో ఏం రాశారో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. ప్రపంచంలో చాలా కాంప్లికేట్‌గా వుండే సాహిత్యాన్ని కూడా అర్థం చేసుకునే శక్తి వుండటంతోపాటు ఎన్నో పుస్తకాలు చదివిన తనకి ఈ పుస్తకం ఎంతమాత్రం అర్థం కాలేదని ట్విట్టర్‌లో మొత్తుకుంటున్నాడంటే పుస్తకంలో మేటర్ ఎంత కంగాళీగా వుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకాన్ని రాసిన రాజు రవితేజ్ పవన్ కళ్యాణ్‌ని తప్పుదోవ పట్టిస్తున్నాడన్న అభిప్రాయాన్ని వర్మ వ్యక్తం చేశాడంటే, వర్మ సదరు ‘ఇజం’ పుస్తకం చదివి ఎంత హర్టయ్యాడో అర్థం చేసుకోవచ్చు.
ఈ పుస్తకాన్ని తాను చదవడానికి శాయశక్తులా ప్రయత్నించానని, తనకి ఎంతమాత్రం అర్థం కాలేదని, ఒక పట్టాన కొరుకుడు పడలేదని వర్మ అన్నాడు. అసలు ఈ పుస్తకాన్ని రాసిన రాజు రవితేజ్‌కైనా ఈ పుస్తకం అర్థమై ఉంటుందని అనుకోనని వర్మ అన్నాడు. పుస్తకం రాసిన రచయితకే అర్థమై వుంటుందా అనే డౌట్ క్రియేట్ చేసిన పుస్తకం మనలాంటి సామాన్యులకు అర్థమవుతుందంటారా? పుస్తక ప్రపంచంలో టెర్రర్ పుట్టిస్తోన్న ఈ ‘ఇజం’ పుస్తకం తాలూకు టెర్రరిజానికి పుస్తక ప్రియులు ఎందుకు బలికావాలి? బుక్ లవర్స్.. బీ కేర్‌ఫుల్!


.jpg)



