Latest News

శతాధిక వృద్ధుడు.. పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ రాజన్ కన్నుమూత

posted on: Mar 20, 2026 10:07AM

పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ చిన్న (టి.సి.) రాజన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 108 ఏళ్లు.  కొంతకాలంగా వృద్ధాప్యంతో వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో పలమనేరులో విషాదం నెలకొంది. పలువురు రాజకీయ ప్రముఖులు రాజన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. 

టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.    దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన రాజన్..   గాంధీజీ, నేతాజీ సిద్ధాంతాలతో ప్రభావితుడయ్యారు. విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.  

రాజకీయాల్లో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ రాజన్ నిరాడంబర జీవితాన్నే గడిపారు. ఎటువంటి ఆస్తులూ కూడబెట్టలేదు.  ఆయనకు సంత ఇల్లు లేదు.   ప్రభుత్వ పింఛన్‌తోనే ఆ  జీవనాన్ని కొనసాగించారు.  2025లో తన 108వ జన్మదినాన్ని జరుపుకున్నారు.   ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పలువురు తమ సంతాపసందేశంలో పేర్కొన్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...