Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాకిస్థాన్ దళారీ దేశం.. కేంద్ర మంత్రి జైశంకర్
posted on: Mar 26, 2026 9:24AM
.webp)
పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేలా వాషింగ్టన్-టెహ్రాన్‌తో మధ్వవర్తిత్వం వహించేందుకు పాక్ ముందుకు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి జైశంకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్దం ఉద్రిక్తతలపై కేంద్రం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పాకిస్థాన్ రాయబారం ప్రయత్నాలను ప్రస్తావిస్తూ ఆ దేశాన్ని దళారీ దేశంగా అభివర్ణించారు.
పాకిస్థాన్‌లాగా భారతదేశం దళారీ దేశం కాదని అన్నారు. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో భారత్ దళారీ పోషిందన్నారు. ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం నాలుగో వారానికి చేరుకోవడంతో మధ్యవర్తిత్వం వహించడానికి పాక్ ముందుకు వచ్చింది. అగ్రదేశం శాంతి ప్రణాళికను ఇరాన్ కు చేరవేసింది. చర్చలకు ఆతిథ్యం ఇచ్చేందుకూ సిద్ధమని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్ ఎందుకు మౌనంగా ఉందని విపక్షాలు ప్రశ్నించినప్పుడు, భారత్‌కు ప్రత్యేక గౌరవం ఉందని.. ఎన్నడూ దళారీ దేశంగా వ్యవహరించదని జైశంకర్ వ్యాఖ్యానించారు.






