భారత్ విదేశాంగ విధానం బ్రహ్మాండం.. పాక్ మాజీ ప్రధాని ప్రశంసల వర్షం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ పై మళ్లీ ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ విదేశాంగ విధానం బ్రహ్మాండమంటూ కితాబిచ్చారు. లాహో్ లో ఆదివారం (ఆగస్టు 14)లాహోర్‌లో ఈ రోజు (ఆదివారం) నిర్వహించిన సభలో ఇమ్రాన్‌ఖాన్‌  అమెరికా ఒత్తిళ్లను లెక్క చేయకుండా, భారత్‌ తక్కువ ధరకు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని ఇమ్రాన్‌ఖాన్‌ సమర్థించారు.

ఇండియా, పాకిస్థాన్‌లకు ఒకే రోజు స్వాతంత్య్రం లభించినా, న్యూఢిల్లి మాత్రం దేశ ప్రజల అవసరాలకు తగినట్లు విదేశాంగ విధానానికి కట్టుబడి ఉందని, కానీ, పాకిస్థాన్‌లోని షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని ఇమ్రాన్‌ఖాన్‌ విమర్శలు గుప్పించారు.

అమెరికాకు ఇండియా వ్యూహాత్మక భాగస్వామి. కానీ, పాకిస్థాన్‌ కాదు. కానీ, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దన్న అమెరికా ఆంక్షలను భారత్‌ ఇసుమంతైనా  లక్ష్య పెట్టకుండా దేశానికి ఎది ప్యయోజనమో అదే చేసిందని ఇమ్రాన్ పేర్కొన్నారు.    చమురు కొనవద్దనేందుకు మీరెవరని భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ అమెరికాను సూటిగా ప్రశ్నించారని పొగిడారు.

రష్యా నుంచి యూరప్‌ గ్యాస్‌ కొనుగోలు చేస్తోంది. మా దేశ అవసరాలకు అవసరమైన చమురు మేం కొంటున్నామని అంతర్జాతీయ వేదికపై అగ్రరాజ్యం అమెరికాకు స్పష్టం చేయడం ద్వారా భారత్ తన సార్వభౌమాధికారంపై మరొకరి పెత్తనం, ఆజమాయిషీని సహించబోదని విస్పష్టంగా తేల్చేసిందని ఇమ్రాన్ పేర్కొన్నారు. ఒక స్వతంత్య్ర దేశ విదేశాంగ విధానం ఎలా ఉండాలో భారత్ ను చూసి పాకిస్థాన్ నేర్చుకోవాలని అన్నారు. అమెరికా ఆగ్రహానికి భయపడి రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించిన పాక్‌ ప్రధానిపై ఇమ్రాన్‌ ఈ సందర్బంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.