Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఉస్మానియా బిస్కెట్ ఫ్యాక్టరీపై... వెలుగులోకి షాకింగ్ విషయాలు
posted on: Mar 27, 2026 7:06PM

హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీ సులు సంయుక్తంగా చేపడుతున్న దాడుల్లో వరుసగా కల్తీ ఆహార దందాలు బయటపడుతున్నాయి. నగరాన్ని కేంద్రంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నకిలీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్న ముఠాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. వంటింటి సామాన్ల నుంచి చిన్నపిల్లలు ఇష్టంగా తినే ఆహార పదార్థాల వరకు కల్తీ వ్యాపారం విస్తరించినట్లు బయటపడటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల పిల్లలు ఎంత ఇష్టంగా తినే ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై జరిగిన దాడుల్లో కుళ్లిన పదార్థాలు, ప్రమాదకర రసాయనాలు ఉపయోగిస్తున్నట్లు గుర్తించిన అధికారులు, తాజాగా నగరంలోని పలు ప్రాంతాల్లో బేకరీ యూనిట్లపై దాడులు నిర్వహించారు. ఈరోజు నిర్వహించిన తనిఖీల్లో... ఎక్కువ మంది చాయ్‌తో పాటు ఇష్టంగా తినే ఉస్మానియా బిస్కెట్ల తయారీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ ఉస్మానియా బిస్కెట్ ఎలా తయారు చేస్తున్నారు చూద్దాం రండి...
హైదరాబాద్ నగరంలోని అంబర్పేట్ ప్రాంతంలో ఉస్మానియా బిస్కెట్లు తయారు చేస్తున్న ఓ ఫ్యాక్టరీ పై పోలీసులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగిస్తున్నట్లుగా గుర్తించారు. బిస్కెట్లకు ఆకర్షణీయమైన రంగులు రావడానికి ప్రత్యేకంగా కెమికల్స్ కలిపి కొత్త రంగులు తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తనిఖీల సమ యంలో ఫ్యాక్టరీలో ఉన్న ఆ పరిశుభ్రత వాతావరణం చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు.
పరిశుభ్రత ప్రమాణాలు పూర్తిగా లెక్క చేయకుండా బిస్కెట్లు తయారీ జరుగుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. అంతేకాదండోయ్ మరో షాకింగ్ విషయం కూడా బయటపడింది. బిస్కెట్ల తయారీలో నాసిరకం పాడైన గుడ్లు ఉపయోగిస్తున్నట్లుగా పోలీసులు గమనించారు. అయితే ఈ విధంగా కుళ్ళిన గుడ్లతో ఉస్మానియా బిస్కెట్లను తయారుచేసి వాటిని పలు షాపులకు సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు తెలుసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఫ్యాక్టరీ యజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. నగరంలో ఆహార భద్రతా ప్రమాణాలపై మరింత కఠినంగా తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.... ఈ ఘటనతో నగరంలో ఫుడ్ సేఫ్టీ చర్చనీయాంశంగా మారింది.






