Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాత్రి పడుకునేముందు సొంపు నీరు తాగితే.. ఆయుర్వేద వైద్యులు చెప్పిన రహస్యాలు ఇవి.. !
posted on: Feb 4, 2026 11:23AM

ఒకప్పుడు సొంపు చాలా మందికి తెలియదు. జీలకర్రను పోలిన సొంపు చాలా మంచి సువాసనతో ఉంటుంది. కొన్నిరకాల వంటల్లో సొంపును వాడతారు. మరికొందరు సొంపును భోజనం తర్వాత జీర్ణశక్తి కోసం తీసుకుంటారు. రెస్టారెంట్లలో భారీ భోజనం తిన్న తరువాత సొంపు ఇవ్వడం వెనుక కారణం.. కడుపు ఉబ్బరం, అజీర్తి ఉండకూడదనే.. అయితే ఆయుర్వేదం సొంపుతో మరింత గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని చెబుతుంది. చాలామంది రాత్రి నీటిలో సొంపును నానబెట్టి ఉదయాన్నే తాగుతూ ఉంటారు. కానీ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగితే అద్భుతాలు జరుగుతాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ రాత్రి పడుకునే ముందు సొంపు నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఆయుర్వేద వైద్యులు ఏం చెప్పారు? తెలుసుకుంటే..
మనం తినే, త్రాగే ఆహారాలు మన చర్మంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయని చెబుతారు. అందుకే మనం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి. కడుపును శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సహజమైన మెరుపు వస్తుంది. సొంపు నీరు కూడా ఇలాంటిదే..
డిటాక్స్ డ్రింక్..
రోజూ డీటాక్స్ డ్రింక్ తాగడం వల్ల శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పోతాయి. ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా, ప్రకాశవంతంగా, యవ్వనంగా ఉంచుతుంది. డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మొటిమలు , మంట, మచ్చలు వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
సొంపు నీటిని ఎలా చేసుకోవాలి..
1 కప్పు నీరు
1 టీస్పూన్ సోంపు..
1 టీస్పూన్ జీలకర్ర..
1 టీస్పూన్ క్యారమ్ విత్తనాలు..
తయారు విధానం..
పైన పేర్కొన్నవన్నీ ఒక పాన్‌లో లేదా గిన్నెలో వేయాలి. అందులో ఒక కప్పు నీరు పోయాలి. దీన్ని తక్కువ మంట మీద మరిగించాలి. 5 నుండి 10 నిమిషాలు ఉడకబెట్టండి. ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. డిటాక్స్ డ్రింక్ రెడీగా ఉన్నట్టే ప్రతి రాత్రి పడుకునే ముందు దీన్ని తయారు చేసుకుని తాగమని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.
ప్రయోజనాలు..
ఈ డిటాక్స్ డ్రింక్ తాగడం వల్ల మొటిమలు తగ్గుతాయి, చర్మం మెరుస్తుంది, కడుపు శుభ్రంగా ఉంటుంది, శరీరం డీటాక్స్ అవుతుంది
సొంపు చేసే మ్యాజిక్..
పైన పేర్కొన్న డిటాక్స్ డ్రింక్ లో సొంపు ఉంటుంది. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి, ఇ తో పాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని శుద్ది చేస్తాయి. ఇది మొటిమలు, ముడతలను తగ్గిస్తుంది, ముఖానికి సహజమైన మెరుపును ఇస్తుంది . ఇది మంటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...


.webp)



