Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రత్యేక హోదా అర్హత ఆంధ్రప్రదేశ్‌కి లేదు: ప్రణాళికా సంఘం
posted on: Jun 13, 2014 6:18PM

రాష్ట్ర విభజన విషయంలో అన్యాయం జరిగినా, ప్రత్యేక హోదా దక్కుతుందన్న ఊరటలో వున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కేంద్ర ప్రణాళికా సంఘం పిడుగు వేసింది. కేంద్రం నుంచి అదనపు సాయం పొందే అర్హత, ప్రత్యేక హోదా పొందే అర్హత ఆంధ్రప్రదేశ్ కు లేదని, జాతీయ అభివృద్ధి మండలి నిర్దేశించిన నిబంధనలు, సూత్రాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పొందలేదని ప్రణాళికా సంఘం తేల్చి చెప్పింది. ప్రణాళికా శాఖ కేంద్ర మంత్రి ఇందర్ జీత్ సింగ్ రావుకు ప్రణాళికా సంఘం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కి ఐదేళ్ళపాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న యుపిఎ గవర్నమెంట్ వాగ్దానం, పదేళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ హామీ, ప్రత్యేక హోదా పదిహేనేళ్ళపాటు కావాలని కోరుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ఆశ గల్లంతయ్యే ప్రమాదం కనిపిస్తోంది. జాతీయ అభివృద్ధి మండలి నిబంధనల ప్రకారం కొండలు, దుర్గమ ప్రాంతాలు ఉండటం, జన సాంద్రత తక్కువగా ఉండటం, పెద్ద సంఖ్యలో గిరిజన జనాభా ఉండటం, వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న సరిహద్దు రాష్ట్రమై ఉండటం వంటి లక్షణాలున్న రాష్ట్రాలకే ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వడానికి వీలవుతుంది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, సిక్కింలకు మాత్రమే ప్రత్యేక హోదా ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్‌ని ప్రత్యేకంగా పరిగణించి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాన్ని పరిశీలించే ఛాన్స్ వుందని కొందరు అధికారులు అంటున్నారు.


(2).jpg)
.jpg)


