Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆంధ్రాని సింగపూర్ చేసే సంగతి తర్వాత...
posted on: May 5, 2014 11:33AM

రాజకీయ నాయకుడు ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ని సింగపూర్ చేసేస్తామని హామీలు ఇస్తున్నారు. వైసీపీ అధినేత అయితే సీమాంధ్రని అంతర్జాతీయ స్ఘాయిలో, సింగపూర్‌కి దీటుగా డెవలప్ చేయడానికి విదేశాల నుంచి కన్సల్టెంట్స్ ని కూడా పిలిపించి ప్లాన్లు వేయిస్తున్నాడంట. ఆంధ్రని సింగపూర్ చేసే సంగతి తర్వాత.. ప్రస్తుతం సింగపూర్లో ఇండియా వాళ్ళకి ఇళ్ళు రెంట్‌కి ఇవ్వమని చెప్పేస్తున్నారట. టు లెట్ బోర్డు వున్న ఇంటికి వెళ్ళి పోర్షన్ చూపిస్తారా? అని అడిగితే మీరు ఇండియన్సేగా.. మీకు ఇల్లు అద్దెకి ఇవ్వమంటూ ముఖంమీదే చెప్పేసి తలుపులు వేసుకుంటున్నారట. సింగపూర్ మొత్తంలే ఇదే పరిస్థితి వుందట. దాంతో సింగపూర్‌లో అద్దె ఇళ్ళు దొరక్క ఇండియన్స్ బోలెడంత ఇబ్బంది పడుతున్నారట.
ఇంతకీ సింగపూరోళ్ళు ఇండియన్స్ ని ఎందుకు ఛీ పొమ్మంటున్నారో తెలుసా? ఇండియన్స్ వంటలు ఘాటైన మసాలాలు ఉపయోగించి వండుతారట, అసలు వంట చేసేటప్పుడే చుట్టుపక్కల అంతా ఆ మసాలా ఘాటు వ్యాపిస్తూ వుంటుందట. అది బల్లులు, పాములు తినే సింగపూరోళ్ళకి ఇబ్బందికరంగా వుందట. అంతేకాకుండా ఇండియన్స్ తమ ఇళ్ళని అపరిశుభ్రంగా వుంచుతారట. ఇల్లు శుభ్రంగా వుంచుకోండని ఎన్నిసార్లు చెప్పినా లైట్‌గా తీసుకుంటారట. అదీ సమస్య. ఫ్యూచర్లో మన సీమాంధ్ర సింగపూర్‌లా మారొచ్చేమోగానీ, మనుషుల అలవాట్లు మారతాయా? సీమాంధ్రని సింగపూర్‌లా మార్చే నాయకులు మనుషుల అలవాట్లని కూడా మార్చగలరా?


.jpg)
.png)


