ఇద్దరు భారతీయ మత గురువుల్ని మాయం చేసిన పాక్!

posted on: Mar 17, 2017 11:49AM

ప్రపంచంలో అత్యంత ప్రమాదకర దేశం ఏది? మీకు ఇంకే పేరు గుర్తుకొచ్చినా తప్పులో కాలేసినట్టే! ఖచ్చితంగా మన పక్క దేశం పాకిస్తాన్ మాత్రమే అత్యంత ప్రమాదకర దేశం! ఇది ఆ దేశం పై వున్న కోపంతోనో, పగతోనో చెబుతున్నది కాదు. నిజంగా పాక్ లో ఎవ్వరికీ భద్రత లేదు. ఉగ్రవాదులు దేశ ప్రధాని కన్నా శక్తివంతులు అయినప్పుడు ఇక చెప్పేదేముంది? తాజాగా జరిగిన పరిణామాలు చూస్తే పాక్ లోని దారుణమైన ప్రమాదకర పరిస్థితులు మరికాస్త అర్థమవుతాయి భారతీయులకి!

 

ఢిల్లీలో హజ్రత్ నిజాముద్దీన్ అనే దర్గా వుంది. చాలా ప్రఖ్యాతి గాంచిన చోటది. అందుకే, అక్కడి రై్ల్వే స్టేషన్ పేరు హజ్రత్ నిజాముద్దీన్ అనే అంటారు! అటువంటి దర్గాకి మౌల్వీ సయద్ అసీఫ్ అలీ నిజామీ. ఆయన తన బంధువు నజీమ్ అలీ నిజామీతో కలిసి మార్చ్ ఎనిమిదిన పాకిస్తాన్ వెళ్లాడు. కరాచీలో దిగిన వారిద్దరూ లాహోర్లో వున్న దాతా దర్భార్ అనే దర్గాను సందర్శించటానికి వెళ్లారు. అయితే, అక్కడ పని పూర్తయ్యాక లాహోర్ ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి కరాచీ ఎయిర్ పోర్ట్ కి రావాల్సి వుంది. కాని, అదే సమయంలో సయద్ అసీఫ్ అలీతో పాటూ ప్రయాణిస్తున్న నజీమ్ అలీని పాక్ అధికారులు ఆపేశారట! కారణం ఆయన వద్ద సంతృప్తికరమైన ట్రావెలింగ్ డాక్యుమెంట్స్ లేకపోవటమే. 

 

లాహోర్లో సయద్ తో పాటూ వున్న నజీమ్ ను ఆపేసిన తరువాత ఆ ఇద్దరి ఫోన్లు స్విచ్చాప్ అయిపోయాయని చెబుతున్నారు వారి బంధువులు. ఇక అప్పట్నుంచీ , అంటే మార్చ్ పద్నాలుగు నుంచీ వారి ఆచూకీ తెలియటం లేదట! ఇదంతా వింటుంటే షాకింగ్ వుంది కదా? అసలు పాక్ కు వెళ్లిన ఎవరో సామాన్యులు కాదు... ఏకంగా భారత్ లోని ఒక ప్రముఖ దర్గా నిర్వహించే మత గురువుకే భద్రత లేకుండాపోయింది! ఇప్పుడు 80ఏళ్ల ఆయన ఎక్కడున్నారో తెలియదు! ఆయనతో పాటూ వున్న 60ఏళ్ల ఆయన బంధువు సంగతి కూడా తెలియదు! విదేశాంగ శాఖా మంత్రి సుష్మా స్వరాజ్ ఇప్పటికే పాక్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆచూకీ కనుక్కోమని అడిగారట. కాకపోతే, అసలు జరిగిన ఈ ఉదంతం చూస్తే పాక్ ఎంతటి ప్రమాదకర గమ్యం ఈజీగా చెప్పేయవచ్చు! 

 

ఇండియా నుంచి వెళ్లిన ఒక ప్రముఖ ఇస్లామ్ మత గురువునే అక్కడి ప్రభుత్వ అధికారులు మాయం చేశారంటే హిందువులో, మన బాలీవుడ్ ప్రముఖులో వెళితే పరిస్థితి ఎలా వుంటుంది? క్రికెట్ ఆడటం మానేసి చాలా రోజులైంది కాని... ఇండియన్ క్రికెటర్స్ కి అయినా ఏం భద్రత వుంటుంది? అసలు ఇండియన్స్ పాకిస్తాన్ వెళ్లే ఆలోచనలు వుంటే అవన్నీ అమాంతం పక్కకు పెట్టటం మంచిది! ఎందుకంటే, ఇప్పుడప్పడే కుక్క తోకలు చక్కగా మారే అవకాశం అస్సలు లేదు!

google-ad-img
    Related Sigment News
    • Loading...