నీతిష్ బ‌లం తేజ‌స్వీయాద‌వ్‌!

సైద్ధాంతిక సారూప్య‌త లేని పొత్త‌లు దీర్ఘ‌కాలం మ‌న్న‌వు. ఇదే బీహార్‌లో బీజెపీ ఎదుర‌యిన అనుభ‌వం.  ఇన్నాళ్ల బీజేపీ పొత్తును కాదు పొమ్మ న్నారు బీహార్ ముఖ్య‌మంత్రి నీతిష్. 2017లో లాలూ అవి నీతిని ఎత్తిచూపుతూ సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలగి, బీజేపీతో జతకట్టిన జేడీయూ 2020 ఎన్నికల్లో లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీగా బరిలోకి దిగింది. ఎన్డీయే కూటమికి మెజారిటీ స్థానాలు వచ్చినా, జేడీయూగా మాత్రం బారీగా నష్టపోయి కేవలం 43 సీట్లకు పరిమితమైన‌ప్ప‌టికీ  బీజేపీ మాత్రం నీతిష్‌నే ముఖ్య మంత్రిని చేసింది. కానీ ప‌రిస్థితులు ఇపుడు ఊహించ‌ని మ‌లుపు తిరిగాయి. 

జేడీయు ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో మంగ‌ళ‌వా రం(ఆగ‌ష్టు 9) స‌మావేశ‌మ‌యిన నీతిష్ బీజెపీ క‌టీఫ్ చెప్ప‌డా నికి నిర్ణ‌యించుకు న్నారు. బీహార్ గ‌వ‌ర్న‌ర్ చౌహాన్‌తో స‌మావేశం కావ‌డం ఒక్క‌టే మిగిలింది. కాగా బీహార్ అసెంబ్లీలో పెద్ద పార్టీగా ఉన్న లాలూ యాద‌వ్ జెడీ యు కూడా స‌మావేశ‌మై బీహార్ రాజ‌కీయ ప‌రిణామాల గురించి చ‌ర్చించింది. బీజెపీతో తెగ‌తెంపులు చేసుకోనున్న నీతిష్‌తో చేతులు క‌లిపేందుకు ఆస‌క్తి ప్ర‌క టించింది. ఈ స‌మావేశంలో కాంగ్రెస్ నాయ‌కులు కూడా పాల్గొని త‌మ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కాంగ్రెస్ కూడా నీతిష్‌నే ముఖ్య‌మంత్రిగా ఆశిస్తున్న‌ది.  ఇదిలా ఉండ‌గా, అటు బీజేపీ కూడా  గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి బీహార్‌లో మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల మీద కూలంక‌షంగా చ‌ర్చించేందుకు స‌మాయ‌త్త‌మ‌ యింది. 

ఇటీవ‌ల తేజ‌స్వి యాద‌వ్‌తో దోస్తానా ధైర్యంతోనే నీతిష్ కుమార్ బీజేపీతో క‌టీఫ్ అన్నారు. బీహార్‌లో క‌లిసి మ‌రోసారి ప్ర‌భుత్వ ఏర్పాటుకు సిద్ధ‌ప‌డిన బీజెపీకి నీతిష్ ఊహించ‌ని షాక్ ఇచ్చారు. 2015 నుండి 2017 వరకు, వారి పార్టీలు ,కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగస్వాములుగా  ఉన్నాయి. ఆ తర్వాత నితీష్‌ కుమార్‌ దాని ని విరమించుకున్నారు. ఆ తర్వాత నితీష్ కుమార్ బిజెపితో తిరిగి కలిశారు. కానీ  పైన పేర్కొన్న కాలం మినహా వారికి దీర్ఘకాల భాగస్వామ్యం ఉంది. బిజెపితో వ్యవహారాలు అకస్మాత్తుగా బ్రేక్ పాయింట్‌కి చేరుకున్నాయి కానీ తేజస్వి యాదవ్‌తో తెరవెనుక కుట్రలు ఈ కేసుల ద్వారా ఉద హరించబడ్డాయి.

మే లో తేజ‌స్వీయాద‌వ్ త‌న నివాసంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకి వెళ్లిన నీతిష్ ఆయ‌న‌తో క‌లిసి కొంత స‌మ‌యం గడిపారు. ఇఫ్తార్ అనేది ఉప‌వాస దీక్ష ముగించ‌డాన్నిసూచిస్తుంది. బీహార్ ముఖ్య‌ మంత్రి 72 ఏళ్ల నీతిష్ కేవ‌లం ఆ విందులో పాల్గొన‌డానికే వెళ్లారు. కానీ ఆ త‌ర్వాత 32 ఏళ్ల యువ నాయ‌కుడు కూడా నీతిష్ నివాసానికి వెళ్లారు. ఆ త‌ర్వాతనే తేజ‌స్వి తండ్రి మాజీ ముఖ్య‌మంత్రి లాలూ యాద‌వ్ మీద అవినీతి కేసు కొత్త‌గా మోపారు. దీనిపై జ‌న‌తాద‌ళ్ యునైటెడ్ పార్టీ త‌ర‌ఫున విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. మరో అవినీతి కేసులో బెయిల్‌ పొంది ఆసుపత్రిలో ఉన్న 74 ఏళ్ల లాలూ యాదవ్‌ పై కేంద్రం తీసుకున్న చర్య ప‌ట్ల వారు మౌనం వహించడాన్ని అంగీకరించలేదు.  

ఇటీవ‌ల అసెంబ్లీ స‌మావేశాల ముగింపు స‌మ‌యంలో తేజ‌స్వీ యాద‌వ్‌, ఆయ‌న ఎమ్మెల్యేలు నీతిష్ కుమార్ ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించ‌డానికి వెను కాడారు. లాలూ యాద‌వ్  తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది ప‌డుతున్న‌పుడు జులైలో ఢిల్లీకి వెళ్ల‌వ‌ల‌సివ‌చ్చి న‌పుడు, ఆయ‌న ప్ర‌యాణం, ఇత‌ర వ‌స‌తుల బాధ్య‌త‌లు నీతిష్ భుజాన వేసుకున్నారు. గ‌త‌వారం ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై తేజ‌స్వీ యాద‌వ్ పార్టీ భారీ నినాదాల‌తో  రోడ్ల మీదకి వ‌చ్చిన‌పుడు వారికి త‌గిన ర‌క్ష‌ణ ఏర్పాట్ల‌తో ప్ర‌ధాన ర‌హ‌దారుల్లోనే వెళ్లడం  నీతిష్ మ‌ద్ద‌తు తోనే జ‌రిగింది.

అలాగే కుల గ‌ణ‌న చేప‌ట్ట‌వ‌ద్ద‌ని కేంద్రం చెప్పిన‌ప్ప‌టికీ, నీతిష్ కుమార్ మే నెల్లో అఖిల‌ప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేసి మ‌రీ బీహార్‌లో కుల గ‌ణ‌న చేప‌ట్టారు. ఇందుకు తేజ‌స్వీ యాద‌వ్ సంపూర్ణ మ‌ద్ద‌తు ఇవ్వ‌డం  నీతిష్‌కు కొండంత ధైర్యాన్నిచ్చింది.