తరువాతి వంతు క్యూబాదే.. డోనాల్ ట్రంప్

posted on: Mar 17, 2026 6:16PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లొ  యుద్ధకాంక్ష  ఊటబావిలో నీరులా ఊరుతూనే ఉంటుందా అనిపిస్తోంది.  ఇప్పటికే ఇరాన్‌పై యుద్దంతో ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోని నెట్టేసిన ట్రంప్.. ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు.  ఇరాన్ తర్వాత తన నెక్ట్స్ టార్గెట్ క్యూబా దేశమేనని చాటాడు. మీడియాతో మాట్లాడుతూ క్యూబా విషయంలో తాను ఏదైనా చేయగలనని, వెనిజులా వ్యవహారాలను ఇప్పటికే తన కంట్రోల్ లో పెట్టుకున్నానన్న ఆయన ప్రస్తుతం ఇరాన్ పై మిలిటరీ యాక్షన్ తో బిజీగా ఉన్నాననీ, అది ఒక కొలిక్కి రాగానే ఇక క్యూబా  వంతేననీ పేర్కొన్నారు. క్యూబాను కూడా తన అధీనంలోకి తెచ్చుకుని ఆ ఘనత కూడా తన ఖాతాలో వేసుకుంటాననీ ట్రంప్ మీడియా సమవేశంలో పేర్కొన్నారు. 

అమెరికా ఆంక్షల కారణంగా ఇప్పటికే  క్యూబా ప్రజలు నానా ఇక్కట్లూ పడుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి తగినంత లేక గ్రిడ్ కుప్పకూలడంతో గత రెండు రోజులుగా క్యూబాలోని పలు ప్రాంతాలు అంధకారంలో ఉన్నాయి.  విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన ఇంధనం లేక క్యూబా కొంతకాలంగా ఇబ్బందులు పడుతోంది. అమెరికా ఆంక్షల కారణంగా గత మూడు నెలలుగా  సముద్రమార్గం మీదుగా తమకు ఎలాంటి ఇంధన సరఫరా జరగలేదని క్యూబా  పేర్కొంది.   క్యూబాపై పట్టు కోసం అమెరికా ఆర్థిక ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. అక్కడ 67 ఏళ్లుగా అధికారంలో ఉన్న పార్టీకి చెక్ పెట్టాలని అమెరికా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

ఈ ఏడాది జనవరిలో వెనెజువెలా అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్నాక ట్రంప్ ప్రభుత్వం క్యూబాపై దృష్టి పెట్టింది. క్యూబాలోకి ముడి చమురు నౌకలు రాకుండా ఆంక్షలు విధించింది. క్యూబా నుంచి అసాధారణ ముప్పు పొంచి ఉన్నందుకే తాము ఆంక్షలు విధించాల్సి వచ్చిందని ట్రంప్ అప్పట్లో చెప్పుకొచ్చారు. ఈ విషయంలో క్యూబా అమెరికాతో డీల్‌కు సిద్ధంగా ఉందని ఆ తరువాత మరో సందర్భంలో అన్నారు. ఇరాన్ తరువాత క్యూబాపై దృష్టి పెడతామని తాజాగా చెప్పారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...