విజయమ్మకు లైఫ్ థ్రెట్.. కొత్త కారు టైర్లు పేలిన ఘటనతో సర్వత్రా అనుమానాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  జగన్  తల్లి  విజయమ్మకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె అనంతపురం జిల్లాలో ఓ వివాహనికి హాజరై.. హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో కర్నూలు నగర శివారులో ఆమె ప్రయాణిస్తున్న కారు ఎడమ వైపు రెండు టైర్లు ఒక్కసారిగా బరస్టయ్యాయి. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తమై.. కారు వేగాన్ని నియంత్రించడంతో.. పెను ప్రమాదం తప్పింది.

ఈ సంఘటన జరిగిన వెంటనే పలువురు విజయమ్మ క్షేమంగా ఉన్నందుకు ఊపిరి పీల్చుకుంటూనే ఆమెకు అంత పెద్ద ప్రమాదం ఎదురు కావడం పట్ల ఆందోళల వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కొత్త కారు అదీ ఖరీరైన అత్యాధునిక హంగులు ఉన్న కారుకు ఒకే సారి రెంటు టైర్లు బరస్ట్ కావడమేమిటన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కొనుగోలు చేసి ఇంకా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా పూర్తికాని కారు టైర్లు రెండు ఒకే సారి బరస్ట్ కావడంపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవలే కొనుగోలు చేసిన టొయోటా వెల్లిఫైర్ కారు ఖరీదు కోటిన్నర అని చెబుతున్నారు. అలాంటి కార్లకు అసలు టైర్లు పేలే అవకాశాలు అతి తక్కువ అని వివరిస్తున్నారు. అదీకాక ఇటువంటి ఖరీదైన కార్లు   ముందుగానే అన్ని టెస్టులూ చేసి, సేఫ్టీ మెజర్స్ అన్నీ సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే  డెలివరీ ఇస్తారని వాహన రంగ నిపుణులు అంటున్నారు. కొత్త టైర్లు బరస్టయ్యే అవకాశమే ఉండదనీ, అలాంటిది రెండు టైర్లు ఒకే సారి బరస్టవ్వడమేమిటని అంటున్నారు.  

 వైయస్ రాజశేఖరరెడ్డి భార్యగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ  అధ్యక్షురాలిగా   విజయమ్మకు ప్రజల్లో   గౌరవ ఉంది.   ఆమె కుమారుడు వైయస్ జగన్ ప్రస్తుతం ముఖ్యమంత్రగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మకు రక్షణగా ఓ ఎస్కార్టు వాహనం అయినా ఉండాలి.. లేకుంటే.. ఆమె భద్రత కోసం కనీసంలో కనీసం  ఇద్దరు  పోలీసులు అయినా ఉండాలని అయితే ఆమె ఎటువంటి భద్రతా సిబ్బందీ వెంట లేకుండా కేవలం ఇద్దరితో మాత్రమే ప్రయాణించడం పట్ల నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఒక వైపు ఏపీ కేబినెట్‌లోని మంత్రులకు జగన్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. అలాగే   ఎమ్మెల్యేలకు సైతం గన్‌మెన్లను కేటాయించింది.  ఎస్కార్ట్ కూడా కేటాయించింది. మరి అలాంటప్పుడు.. మాజీ సీఎం వైయస్‌ఆర్ భార్యగా, ప్రస్తుత సీఎం వైయస్ జగన్‌కి తల్లిగా.. ఓ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వైయస్ విజయమ్మకు ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విజయమ్మ కారుకు జరిగిన ప్రమాదం తీరును గమనిస్తుంటే ఆమె ప్రణాలకు ముప్పు ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.