Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎవరా మహిళా సునామీ... ప్రియాంకే కదా!
posted on: Aug 20, 2014 5:20PM
.jpg)
ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని అధికారం చెలాయించడం రాహుల్ గాంధీకి అలవాటైపోయినట్టుంది. మొన్నటి వరకు తల్లి సోనియాగాంధీ కొంగుచాటున వుండి అధికారం చెలాయించారు. ఇప్పుడు తన అక్క ప్రియాంక చాటున చేరి హవా నడిపించాలని అనుకుంటున్నారు. అందుకే ప్రియాంకకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. సోమవారం జరిగిన ఒక సమావేశంలో రాహుల్ గాంధీ తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో మాట్లాడారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించాలంటే మహిళా సునామీ రావాల్సిందేనని అన్నారు. మహిళా సునామీ అంటే కాంగ్రెస్ పార్టీకి మహిళల మద్దతు కావాలని అన్నారో లేక, ఒక సునామీ లాంటి మహిళా శక్తి ప్రియాంక రంగంలోకి రావాలని అన్నారో కొంతమందికి అర్థం కాలేదు. అయితే చాలామందికి మాత్రం రాహుల్ గాంధీ ప్రియాంక ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశానికి సూచనలు చేస్తున్నారని అర్థమైపోయింది. తనకు ప్రజల్లో ఎలాగూ అంత సీన్ లేదని క్లియర్‌గా అర్థమైపోయింది కాబట్టి ప్రియాంకని రంగంలోకి దించడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని అర్థమైపోతోంది.
త్వరలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో ఒకవైపు మహిళా బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని చెబుతూనే.. మరోవైపు ఇలా మహిళా శక్తి గురించి కూడా రాహుల్ మాట్లాడుతున్నారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క పథకం సామాన్యుడికి మేలు చేసిందని ఆయన అన్నారు.మన దేశంలో దేవతలను ఆరాధిస్తామని.. కానీ ఆలయాల్లో దేవతలను ఆరాధించేవాళ్లలో చాలామంది బయట బస్సుల్లోను, రోడ్ల మీద మహిళలను వేధిస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలోని ప్రతి మహిళా ఏదో ఒక సందర్భంలో వేధింపులకు గురైనవారేనని రాహుల్ గాంధీ చెప్పారు. మరి ఈ పదేళ్ళలో రాహుల్ గాంధీ ఈ విషయంలో ఏం చేసినట్టో?



.jpg)


