ఏబీకేకు రాజా రామ్మోహన్ రాయ్ జాతీయ పరుస్కారం

సుప్రసిద్ధ పత్రికా సంపాదకుడు ఏబీకే ప్రసాద్ కు ప్రతిష్ఠాత్మక రాజా రామ్మెహన్ రాయ్ జాతీయ పరుస్కారం లభించింది. ఈ విషయాన్ని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. జర్నలిజంలో అసమాన ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డు ఏబీకేను వరించింది. ఈ అవార్డును ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్ పర్సన్  జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్  ఈ నెల 28న ఢిల్లీలో ఏబీకేకు అందజేయనున్నారు.

ఏబీకే ప్రసాద్ జర్నలిజంలో పరిచయం అక్కర్లేని పేరు.    విశాలాంధ్రలో సబ్‌ఎడిటర్‌గా తన జర్నలిస్టు జీవితాన్ని ప్రారంభించిన ఏబీకే ప్రసాద్ అక్కడ నుంచి అంచలంచలుగా ఎదిగి తెలుగులో ఆంధ్రపత్రిక, సాక్షి వినా దాదాపు అన్ని పత్రికలలోనూ పని చేశారు.

ఈనాడు, ఉదయం, వార్త పత్రికలను సంపాదకుడిగా లాంచ్ చేశారు. కొత్తగా దినపత్రిక ప్రారంభించాలనుకునే వాళ్ల తొలి ఛాయస్ ఏబీకే అనడంలో సందేహం లేదు.  అందుకే ఆయన తరచూ ఉద్యోగాలు మారే వారు. ఏది ఏమైనా తెలుగు పత్రికా రంగంలో ఏబీకేది ఎప్పటికీ చెరిగిపోని సంతకం అనడంలో సందేహం లేదు.