ఐపీఎల్ 2026: గాయాలతో నాథన్ ఎల్లీస్, సామ్ కర్రన్ ఔట్

posted on: Mar 21, 2026 6:21AM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందే పలు ఫ్రాంచైజీలకు షాక్ తగిలింది. టోర్నీ మొదలవ్వకముందే కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడి టోర్నీకి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. కోట్లు పోసి కొన్న ఆటగాళ్లు దూరం కావడం ఫాంచైజీలకు మింగుడుపడటంలేదు. కీలక ఆటగాళ్లు లేకపోవడంతో టోర్నీ కళ తప్పుతుందా అని అభిమానుల్లో ఆందోళన నెలకొంది.   ముఖ్యంగా డిఫెండింగ్ ఛాంపియన్స్‌తో పాటు ఇతర ప్రధాన జట్లులో కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టోర్నీలో ఆడటం అనుమానంగా మారింది.   ఆస్ట్రేలియా పేసర్ నాథన్ ఎల్లిస్,  స్టార్ ఆల్ రౌండర్ సామ్ కర్రన్ సహా పలువురు కీలక ప్లేయర్లు టోర్నీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే)కు ఈ సీజన్ ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. వేలంలో ఆ జట్టు కొనుగోలు చేసిన ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ నాథన్ ఎల్లిస్ తొడ కండర గాయం   కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యాడు. ప్రాక్టీస్ సెషన్లలో చురుగ్గా పాల్గొంటున్న క్రమంలో అతడికి ఈ గాయమైంది.  డెత్ ఓవర్లలో పరుగులు నియంత్రించడమే కాకుండా కీలక వికెట్లు తీసే వేసే ఎల్లిస్ దూరం కావడం చెన్నై బౌలింగ్ విభాగానికి పెద్ద లోటు అనడంలో సందేహం లేదు. ఇక పోతే రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక ఆటగాడు, ఇంగ్లాండ్ స్టార్ఆల్ రౌండర్ కూడా గాయం కారణంగా ఈ సీజన్ కు అందుబాటులో లేకుండా పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు.   ట్రేడింగ్ ద్వారా చెన్నై నుంచి రాజస్థాన్‌కు మారిన కర్రన్ తప ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టులో కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్న తరుణంగా టోర్నీకి దూరమయ్యే పరిస్థితి రావడం రాజస్థాన్ రాయల్స్ పెద్ద దెబ్బేనని చెప్పాలి.  

అలాగే పంజాబ్ కింగ్స్ కు కూడా  గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ లూకీ ఫెర్గూసన్ టోర్నీలో లీగ్ దశలో చాలా వరకూ అందుబాటులో ఉండడు.    వ్యక్తిగత కారణాల వల్ల లూకీ ఫెర్గూసన్ మొదటి ఏడు మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్ స్పీడ్‌స్టర్ లేకపోవడం పంజాబ్ జట్టు పేస్ విభాగాన్ని వీక్ అవుతుందనడంలో సందేహం లేదు. . వరుసగా ఇలా కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఆయా ఫ్రాంచైజీలు ప్రత్యామ్నాయ ఆటగాళ్ల కోసం అన్వేషిస్తున్నాయి. 
 నాథన్ ఎల్లిస్ స్థానంలో ఎవరిని తీసుకోవాలనే అంశంపై చెన్నై యాజమాన్యం కసరత్తు చేస్తోంది. అటు రాజస్థాన్ కూడా సామ్ కర్రన్ అందుబాటుపై స్పష్టత రాగానే రీప్లేస్‌మెంట్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఈ గాయాల ప్రభావం ఆయా జట్ల ప్రదర్శనపై కచ్చితంగా ప్రభావం చూపుతుందంటున్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...