Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...భ్రమలు కలిగించని రైల్వే బడ్జెట్!
posted on: Jul 9, 2014 3:41PM

నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ ఇటీవలి కాలంలో అత్యుత్తమ రైల్వే బడ్జెట్‌లలో ఒకటిగా నిలిచే బడ్జెట్ అని పేర్కొనవచ్చని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలయిన యుపిఎ పక్షాలు పైకి ఈ బడ్జెట్‌లో ఏమీ లేదని పెదవులు విరిచినప్పటికీ మనసులలో మాత్రం ఇలాంటి చక్కని బడ్జెట్ తాము ఎప్పుడూ ప్రవేశపెట్టలేకపోయామే అని అసూయపడక తప్పదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్ర రైల్వే మంత్రి సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ అత్యుత్తమ బడ్జెట్ అని చెప్పడానికి ఈ బడ్జెట్‌లో ఆకర్షణీయమైన అంశాలు ఏమి వున్నాయి? గత బడ్జెట్‌లతో పోలిస్తే కొత్త రైల్వే లైన్లు ఎన్నిటిని ఓకే చేశారు? ఎన్ని కొత్త రైళ్ళు ప్రకటించారు అనే సందేహాలు కలగవచ్చు. కానీ అలాంటి భ్రమలేవీ దేశ ప్రజలకు కల్పించకపోవడమే ఈ బడ్జెట్ అత్యుత్తమ బడ్జెట్ అని చెప్పడానికి గత ఒక ప్రధాన అంశం. గత ప్రభుత్వాలు రైల్వే బడ్జెట్‌లను ప్రవేశపెట్టినప్పుడు కొత్త రైల్వే లైన్ల విషయంలో, కొత్త రైళ్ళ విషయంలో, రైల్వే అభివృద్ధి పనుల విషయంలో పుంఖాను పుంఖాలుగా హామీలను, ప్రణాళికలను బడ్జెట్ ప్రతిపాదనలలో పెట్టాయి. ఆ క్షణంలో అవి ప్రజల్లో విపరీతమైన ఆనందాన్ని కలిగించి వుండొచ్చు. అయితే సదరు బడ్జెట్‌లలో పేర్కొన్న హామీలలో ఎన్ని కార్యరూపం దాల్చాయన్న విషయాన్ని పరిశీలిస్తే ఒక భ్రమలాగా ప్రజల్ని ఆవరించిన ఆ ఆనందం ఆవిరైపోవడం ఖాయం. ఎందుకంటే గత రైల్వే బడ్జెట్‌లలో ప్రకటించిన అనేక హామీలు, వరాలు ఎన్నో మూలనపడిపోయాయి. అలాంటి మూలన పడిపోయే హామీలు గుప్పించకుండా, దేశ ప్రజల్ని భ్రమల్లో ముంచకుండా వాస్తవ రూపంగా వున్న రైల్వే బడ్జెట్‌గా సదానంద గౌడ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ని రాజకీయ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.


.jpg)



