Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అసెంబ్లీపై నుంచి అమరావతి మొత్తం కనిపించేలా చర్యలు : మంత్రి నారాయణ
posted on: Mar 23, 2026 9:27PM
.webp)
అమరావతిలో 250 మీటర్ల ఎత్తుతో ప్రపంచస్థాయి అసెంబ్లీని నిర్మిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. కేంద్రం, హడ్కో నుంచి నిధుల సమీకరణ పూర్తయిందని మంత్రి వెల్లడించారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మిస్తున్న ఐకానిక్ కట్టడాల విశిష్టతను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై రాష్ట్ర మున్సిపల్, పరిపాలన శాఖ మంత్రి పొంగూరు నారాయణ సోమవారం(23-3-26) కీలక అప్‌డేట్స్ ఇచ్చారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ టవర్లను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలుగా నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు.
అమరావతి నిర్మాణంలో భాగంగా నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల విశిష్టతను, నిధుల సమీకరణను మంత్రి నారాయణ వివరించారు. అమరావతి అసెంబ్లీ భవనాన్ని 250 మీటర్ల ఎత్తులో నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ భవనంపైకి ప్రజలు వెళ్లి మొత్తం అమరావతి నగరాన్ని వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని ఉత్తమ అసెంబ్లీ భవనాల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ, హైకోర్టుతో పాటు మరో ఐదు ఐకానిక్ టవర్లను అత్యద్భుతంగా నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఐకానిక్ భవనాలు కాబట్టి సాధారణ భవనాల కంటే వీటికి ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లోని ఐకానిక్ భవనాల రేట్లతో పోల్చి వీటిని చూస్తున్నామని, ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాజధాని పనుల కోసం భారీ ఎత్తున నిధులను ప్రభుత్వం సమకూర్చుకుంటోందని మంత్రి నారాయణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 15 వేల కోట్లు, హడ్కో ద్వారా మరో రూ. 11 వేల కోట్లు సమకూర్చుకుంటున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
ప్రస్తుతం అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారుల కోసం నిర్మిస్తున్న సుమారు 3,500 ఫ్లాట్లు ఈ మార్చి నెలాఖరు కల్లా పూర్తి కానున్నాయని చెప్పారు. సెక్రటేరియట్, హైకోర్టు వంటి ఐకానిక్ భవనాలను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, స్పోర్ట్స్ సిటీ కోసం ఇప్పటికే రెండో విడత ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని తెలిపారు.


.webp)



