అంధకారంధ్రప్రదేశ్‌.. ఫ్యాన్‌కు ఓటేస్తే ఫ్యాన్ ఆగిపోయింది.. జ‌గ‌న్‌కు లోకేశ్ పంచ్‌లు..

ఈమ‌ధ్య టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ మాట‌లు.. తూటాల్లా పేలుతున్నారు. ఆయ‌న చేస్తున్న ప‌దునైన విమ‌ర్శ‌లు సీఎం జ‌గ‌న్ గుండెల్లో ఈటెల్లా గుచ్చుకుంటున్నాయి. గురి చూసి కొడుతున్నారు. ఎక్క‌డ స‌మ‌స్య ఉందో.. స‌రిగ్గా అదే పాయింట్ ప‌ట్టుకొని లాగుతున్నారు. లోకేశ్ చేసే విమ‌ర్శ‌లకు స‌మాధానం ఇవ్వ‌లేక వైసీపీ ప్ర‌భుత్వం నోరూమూసుకు కూర్చొంటోంది. లోకేశ్ దూకుడును త‌ట్టుకోలేక‌.. కేసుల‌తో నోరుమూయించే ప్ర‌య‌త్నం చేస్తోంది. అయినా, నారా లోకేశ్ త‌గ్గేదే లే.. అంటూ ప్ర‌జ‌ల ప‌క్షాన గొంతు మ‌రింత బిగ్గ‌ర‌గా వినిపిస్తున్నారు. తాజాగా, క‌రెంట్ కోత‌ల‌పై త‌న‌దైన స్టైల్‌లో సెటైర్లు వేశారు లోకేశ్‌. 

ఏపీలో ప్రజలు ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తే ఇంట్లో ఫ్యాన్‌ ఆగిపోయిందని నారా లోకేశ్ మండిప‌డ్డారు. రాష్ట్రాన్ని జగన్ అంధకారంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. ‘‘ఓ వైపు విద్యుత్‌ ఛార్జీల పెంపు పేరుతో ప్రజలపై భారం మోపుతున్నారు. మరోవైపు విద్యుత్‌ కొరతతో అంధకారంలో ఉండాల్సిన పరిస్థితి. బొగ్గు కొరత ఏర్పడుతుందని 40 రోజుల ముందే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించినా సీఎం జగన్‌లో చలనం లేదు. బొగ్గు ఉత్పత్తి సంస్థలకు చెల్లించాల్సిన రూ.215 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం దారుణం. అవసరం మేర బొగ్గు నిల్వ చేసుకోవాలన్న కేంద్రం హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టి.. అవినీతి సొమ్ము నిల్వ చేసుకోవ‌డంలో జ‌గ‌న్ బిజీ అవ్వ‌డం వ‌ల్లే రాష్ట్రానికి ఈ దుస్థితి అంటూ అని నారా లోకేశ్‌ ఆరోపించారు.