Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...లోకేష్ ప్రజాదర్భార్ @ 87వ రోజు
posted on: Apr 8, 2026 3:35PM

కష్టాల్లో ఉన్న వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ 87వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. బుధవారం (ఏప్రిల్ 8) జరిగిన ఈ కార్యక్రమానికి జనం పెద్ద సంఖ్యలో హాజరై వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేష్ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. వివిధ సమస్యలపై వారి నుంచి వినతులు స్వీకరించారు.
సత్వరమే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్ల గాలా(సికింద్రాబాద్) డిపోను తరలించకుండా విజయవాడలోనే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆ డిపో సిబ్బంది మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ బోర్డును కొండపల్లి నుంచి మోటమర్రికి పెంచడం వల్ల గత 17 ఏళ్లుగా విజయవాడలో ఉన్న సికింద్రాబాద్(గాలా) డిపో ఉనికి సందిగ్ధంలో పడిందని, డిపోను మోటమర్రికి లేదా డోర్నకల్ కు తరలిస్తారనే ప్రచారంతో సుమారు 500 కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయనే విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ దినసరి ఉద్యోగుల కమిటీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష ను కలిసి కోరారు.
కోవిడ్ వల్ల నష్టపోయిన హైర్ బస్ యజమానుల బస్సులకు రీప్లేస్ మెంట్ కల్పించి ఆదుకోవాలని ఏపీ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో తమకు వంశపారంపర్యంగా సంక్రమించిన 2.63 ఎకరాల భూమిని శిరిగిరి చంద్రమౌళీశ్వర రెడ్డి ఆక్రమించారని, విచారించి తగిన న్యాయం చేయాలని కర్నూలు జిల్లా గుండంపాడుకు చెందిన ఎస్.చిన్న శివమ్మ మంత్రి నారా లోకేష్ ను కలిసి కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.



.webp)


