Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నారా లోకేశ్ ప్రజాదర్బార్ @ 84 డేస్..
posted on: Mar 23, 2026 7:41PM

ప్రజల సమస్యలను నేరుగా విని, వాటిని పరిష్కరించే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ నిర్వహిస్తున్న 'ప్రజాదర్బార్' కార్యక్రమం ప్రజాప్రతినిధులందరికీ మార్గదర్శకంగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా విశాఖపట్నంలో మంత్రి నారా లోకేశ్ 84వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. విద్యుత్ శాఖ పోస్టుల భర్తీ, ఏయూ ఉద్యోగుల వయ పరిమితి పెంపు వంటి అంశాలపై మంత్రి వినతులు స్వీకరించారు.
సోమవారం (23-3-26) విశాఖపట్నంలో టీడీపీ కార్యాలయం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ వర్గాల ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యలను నిశితంగా పరిశీలించి.. త్వరలోనే పరిష్కరిస్తానని లోకేశ్ భరోసా కల్పించారు. ఆంధ్రా యూనివర్సిటీలో మినిమం టైమ్ స్కేల్ మీద పనిచేస్తున్న ఉద్యోగులు మంత్రి లోకేశ్‌ని కలిశారు. తమ పదవీ విరమణ వయోపరిమితిని 62 ఏళ్లకు పెంచాలని వారు కోరారు. ఇతర ప్రభుత్వ విభాగాల్లో ఉన్న విధంగానే తమకు కూడా ఈ వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై పలువురు అభ్యర్థులు స్పందించారు.
విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జూనియర్ లైన్‌మెన్ పోస్టులను కూడా ఈ క్యాలెండర్‌లో చేర్చి, వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని మంత్రిని కోరారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న పోర్టర్లు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలో ప్రారంభం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తమ సేవలను ఉపయోగించుకోవాలని, తమకు ఉపాధి కల్పించాలని మంత్రి లోకేశ్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయా సమస్యలను అధికారులు పరిశీలించాలని మంత్రి లోకేశ్ ఆదేశించారు. యువతకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి లోకేశ్ భరోసా కల్పించారు.



.webp)


