Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తాతలాగా, నాన్నలాగా మంచిపేరు తెచ్చుకోలేకపోవచ్చు
posted on: May 6, 2017 6:04PM
.jpg)
శనివారం తన విశాఖపర్యటనలో మీడియాతో మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాతలాగా, నాన్నలాగా తాను అంతటి మంచిపేరు తెచ్చుకోలేకపోవచ్చు గానీ పార్టీకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెడ్డపేరు తీసుకురానని... తాను దొంగబ్బాయిని కానని, దొంగ పేపర్లు, దొంగ చానల్స్‌ను నడపడం లేదని జగన్ ని ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని, త్వరలోనే మిగతా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. అలాగే గ్రామస్థాయిలో పార్టీ ఎన్నికలకు సంబంధించి కార్యకర్తల సూచన మేరకే నియామకాలు ఉంటాయని తెలిపారు. లోకేష్... లోక్యాష్ అని పలువురు తనపై ఆరోపిస్తున్నారని, దమ్ముంటే 24 గంటల్లో నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. ఒక వేళ నిరూపించలేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి కేవలం సేవ చేయడానికి మాత్రమే వచ్చానని, కొందరిలాగా సంపాదించుకోవడానికి మాత్రం కాదని అన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నట్టు, గ్రామీణ ప్రాంతాల రూపరేఖలు త్వరలోనే పూర్తిగా మార్చివేస్తామని చెప్పారు లోకేష్.


.jpg)



