Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పాత తుపాకులు... 15 కోట్లు!
posted on: Jul 8, 2024 3:48PM

యూరప్ చరిత్ర మీద బలమైన ముద్ర వేసిన ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనపార్ట్.కి చెందిన అరుదైన వస్తువులను వేలం వేశారు. వీటిలో రెండు తుపాకులు వున్నాయి. వీటిల్లో ఒకదానితో ఒకసారి నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఆ తర్వాత విరమించుకున్నాడు. ఇప్పుడు ఆ తుపాకితోపాటు నెపోలియన్ ఉపయోగించిన మరో తుపాకిని కూడా వేలం వేశారు. ఇది 1.69 మిలియన్ యూరోలకు అమ్ముడయ్యాయి. అంటే మన కరెన్సీలో 15 కోట్ల రూపాయలు.
1814లో ఏప్రిల్ 12న నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఈ రెండు తుపాకుల్లో ఒక తుపాకిని చేతిలోకి కూడా తీసుకున్నాడు. కానీ, ఆ తర్వాత ఎందుకో విరమించుకున్నాడు. ఈ విషయాన్ని అప్పట్లో నెపోలియనే స్వయంగా వెల్లడించాడు. నెపోలియన్ వాడిన ఈ తుపాకులను మెరైన్ గోస్సెట్ అనే సంస్థ తయారు చేసింది. ఇప్పుడు వేలంలో ఈ తుపాకులకు రికార్డు స్థాయి ధర లభించడం ఆ కంపెనీ వాళ్ళని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఫ్రాన్స్ ప్రభుత్వం నెపోలియన్ వాడిన తుపాకులను జాతీయ సంపదగా ఇటీవలే ప్రకటించింది. అయినప్పటికీ, వీటిని బహిరంగ వేలంలో ఫ్రాన్స్ పౌరుడు ఒకరు కొనుగోలు చేశారు. వీటిని దేశం దాటించడానికి అవకాశం లేదు. ఈ తుపాకులను త్వరలో ప్రభుత్వమే కొనుగోలు చేసే అవకాశం వుంది. ఈ రెండు తుపాకుల తయారీలో బంగారం, వెండిని ఉపయోగించారు. ఇవి నెపోలియన్‌కి వారసత్వంగా లభించాయి.






