రోజమ్మా... మాట తప్పమ్మా!

నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి చేతిలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తుక్కుతుక్కుగా ఓడిపోయారు. ఇదేం ఆశ్చర్యపోయే విషయం కాదు.. అందరూ ఊహించిందే జరిగింది. ఓడిపోతామని తెలిసినా నానా హడావిడి చేసిన వైసీపీ వర్గాల మీద జాలి పడటం తప్ప ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఎన్నికల ప్రచారం సందర్భంగా రెండు పార్టీల వాళ్ళూ రకరకాల ఛాలెంజ్‌లు, సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకున్నారు.

 

ఎక్కడో లగడపాటి రాజగోపాల్ ‌లాంటి వాళ్ళు తప్ప ఏ కరడుగట్టిన రాజకీయ నాయకుడూ తాను చేసిన సవాల్‌కి కట్టుబడి వున్నట్టు చరిత్రలో లేదు. ఈ ఎన్నికలలో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని శిల్పా మోహన్ రెడ్డి చేసిన సవాల్‌ని చాలామంది లైట్‌గా తీసుకున్నారు. ఎలాగూ ఓడిపోయిన తర్వాత ఆయన సింపుల్‌గా ‘‘తూచ్’’ అంటారనే అందరూ అనుకున్నారు. అందరూ అనుకున్నట్టుగానే ఆ మహానుభావుడు తాను చేసిన సవాల్‌కి కట్టుబడి వుండాల్సిన అవసరం లేదని కూల్‌గా చెప్పేశారు. ఇలాంటి రియాక్షన్ ముందుగానే ఊహించింది కాబట్టి ఎవరూ హర్ట్ కాలేదు.అయితే ఇప్పుడు జనాలు హర్ట్ అవుతామోనని భయపడుతున్న అంశం మరొకటివుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా మరో భీషణ సవాల్ చేసిన వ్యక్తి రోజా. ఈ ఎన్నికలలో వైసీసీ అభ్యర్థి ఓడిపోతే గుండు కొట్టించుకుంటానని ఆమె బోండా ఉమకి సవాల్ విసిరారు. ఇప్పుడు ఎలాగూ వైసీపీ అభ్యర్థి ఓడిపోయారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చాలామంది రోజాకి ఫొటోషాప్‌లో గుండు కొట్టేసి పెట్టేశారు.

 

ఇదిలా వుంటే, రోజా తాను చేసిన సవాల్‌ ప్రకారం నిజంగానే గుండు కొట్టించుకుంటారేమోనన్న ఆందోళన చాలామందిలో కలుగుతోంది. రోజా గుండు కొట్టించుకుంటే చూడలేక కళ్ళు తిరిగి పడిపోతామని చాలామంది భయపడుతున్నారు. అబద్ధాలు ఆడటం, ఆడిన మాట తప్పడం వైసీపీ వర్గాలకు అలవాటే. ఆ అలవాటు ప్రకారం రోజా కూడా మాట తప్పి గుండు కొట్టించుకోరన్న నమ్మకం ఒకవైపు వున్నప్పటికీ,  తాను చేసిన సవాల్‌కి కట్టుబడి ఆమె గుండు కొట్టించుకుంటారేమోనని జనం భయపడుతున్నారు. దేవుడా రోజాని గుండులో చూసే దౌర్భాగ్యం తమకి పట్టకుండా చూడమని భగవంతుణ్ణి వేడుకుంటున్నారు. గుండు విషయంలో రోజా మాట తప్పాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu