Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎచ్చెర్లపై నాగబాబు ఫోకస్ ...జనసేనాని వ్యూహాత్మక అడుగులు!
posted on: Mar 22, 2026 11:06AM

పార్టీ స్థాపించి దశాబ్ధం గడిచినా జనసేనకు బలమైన పునాదులు కనిపించడం లేదు. కేవలం డిప్యూటీ సీఎం పవన్ చరిష్మాతోనే పార్టీ నడుస్తోంది తప్ప.. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కాలేదు. ఓ సారి అధికారంలోకి వచ్చి ఆర్థికంగా కుదుటపడితే, తర్వాత పార్టీ రూట్స్ స్ట్రాంగ్ చేసేలా చర్యలు చేపడతారని జనసేనలోని చాలా మంది భావించారు. అయితే..డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్‌కళ్యాణ్ పూర్తిగా పాలనపైన దృష్టి పెట్టారని.. పార్టీ నిర్మాణాన్ని పక్కన పడేశారని జనసైనికుల్లో ఒకింత అసహనం కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల విమర్శ కూడా అదే. కానీ పార్టీ పటిష్టత దిశగా పవన్ అడుగులు చూస్తే వ్యూహాత్మకంగానే కనిపిస్తున్నాయి.
జనసేనాని పవన్ కళ్యాణ్ తన సోదరుడు, పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నాగబాబు తరచూ ఉత్తరాంధ్రలో అందులోనూ శ్రీకాకుళంలో పర్యటిస్తూ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారంట. తరచూ సిక్కోలు టూర్స్ పై ఓ ఆసక్తికర ప్రచారం కూడా నడుస్తోంది. ఉత్తరాంధ్రలో తూర్పు కాపుల ప్రభావం చాలా ఎక్కువ. ఇక ఉమ్మడి శ్రీకాకుళంలో ఈ సామాజికవర్గం ఓటర్లే నిర్ణయాత్మకంగా ఉంటారు. అందుకే శ్రీకాకుళం నుంచే పవన్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
అక్కడ నుంచి ఉత్తరాంధ్ర మొత్తం పార్టీ రూట్స్ స్ట్రాంగ్ చేసుకోవాలని జనసేనాని స్కెచ్ గీస్తున్నారంట.
వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకే పార్టీ ఆవిర్బావ వేడుకలు కూడా నాగబాబు ఎచ్చర్లలోనే జరుపుకున్నారు. కాపు ప్రతినిధిగా నాగబాబుని పెట్టి ముందుకెళ్లాలన్నది జనసేనాని స్ట్రాటజీగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బలమైన తూర్పుకాపు నేత కరువైయ్యారు. దానికి తోడు తూర్పు కాపులకు రాజకీయంగా జిల్లాలో అన్యాయం జరుగుతోందని అభిప్రాయం కూడా ఉంది. గతసారి వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జిల్లా నుంచి తూర్పుకాపులకు చెప్పుకోదగ్గ పదవులు లేవు.
సిక్కోలు పొలిటికల్ వార్ మొత్తం వెలమ వర్సెస్ కళింగ గానే నడుస్తోంది. దీంతో కాపులకు తాను కాపుకాస్తానని చెప్పడమే పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర మొత్తం మీద వైసీపీలో బొత్స సత్యనారాయణ, టీడీపీలో కిమిడి కళావెంకట్రావు బలమైన తూర్పు కాపు నాయకులుగా ఉన్నారు. కిమిడికి దాదాపు మొన్నటి ఎన్నికలే చివరివి అంటున్నారు. ఇక బొత్సకి ఆరోగ్యం కూడా సహకరించడం లేదు కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారనేది అనుమానమే. సో.. ఇప్పుడు టీడీపీ, వైసీపీలో కాపులను నడిపించే నాయకులు లేరు కాబట్టి.. జనసేన వారికి అండగా ఉండేందుకు ప్రయత్నిస్తోందని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆ క్రమంలో జనసేనాని అన్న కోసం ఎచ్చర్లను ఎంచుకోవడంలో కూడా ఓ తెలివైన వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో తూర్పుకాపులే ఎక్కువ. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఈశ్వర్ రావుది కమ్మ సామాజిక వర్గం. కేవలం టీడీపీ బలంతోనే ఆయన గెలిచారు. టీడీపీకి ప్రస్తుతం అక్కడ ఇంచార్జ్ కూడా లేకపోవడంతో క్యాడర్ తలోదారి అన్నట్టు ఉంది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేపై ప్రజల్లో సానుకూలత కూడా కనిపించడం లేదు.
ఈ పరిస్థితిని వైసీపీ అయినా క్యాష్ చేసుకుంటుందా? అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కాపు నేత గొర్లె కిరణ్ అసలు రాజకీయాల్లో ఉన్నారా? లేరా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. సో.. ఈ పొలిటికల్ స్పేస్ ని నింపడానికి జనసేన ప్రయత్నిస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆలోచనలు అన్నీ బాగానే ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఆచరణ ఉన్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందనేని చివరి వరకు సస్పెన్సే. మరి పవన్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.


.webp)



