కేకేఆర్‌పై ముంబై ఇండియన్స్ శుభారంభం

posted on: Mar 29, 2026 11:21PM

ఐపీఎల్‌లో 300వ మ్యాచ్ ఆడుతున్న ముంబై ఇండియన్స్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌పై విజయంతో ఈ సీజన్లో శుభారంభం చేసింది. తొలుత బ్యాంటింగ్ చేసిన కేకేఆర్ నాలుగు వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌కు 221 పరుగుల టార్గెట్ పెట్టింది.   ఓపెనర్లుగా దిగిన రోహిత్ శర్మ, రికెల్టన్ నిలకడగా రాణించి తొలి వికెట్‌కు 148 పరుగులు చేసి ముంబై పనిని సులభతరం చేశారు.

11.5 ఓవర్లో రోహిత్ శర్మ(78, 38 బంతులు) ఓట్ అవ్వడంతో బరిలోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ దూకుడు ప్రదర్శించినప్పటికీ 8 బంతుల్లో 16 పరుగులు చేసి 179 స్కోరు వద్ద రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ఓపెనర్ రికెల్టన్‌ (81,43 బంతులె) 184  స్కోరు వద్ద రనౌట్ అవ్వడంతో ముంబై మూడో వికెట్ కోల్పోయింది.

తర్వాత తిలక్ వర్మ (20, 14 బంతులు) ఔట్ అవ్వడంతో..  హార్థిక్ పాండ్యా(18 నాటౌట్, 11 బంతులు)తో జత కలిసిన నమన్‌ధీర్ (5 నాటౌట్, 2 బంతులు)మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేసి ముంబై ఇండియన్స్‌కు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందించారు. కేకేఆర్ జట్టులో అజింక్య రహనే(67), రఘువంశీ (51), రింకూ సింగ్ (33 నాటౌట్) బ్యాట్ తో రాణించారు,

google-ad-img
    Related Sigment News
    • Loading...