Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంబానీ కొడుకు పెళ్లి కార్డు ధర ఎంతో తెలుసా...?
posted on: Dec 9, 2017 4:06PM
.jpg)
డబ్బు ఉన్నోళ్లు ఏం చేసినా సెన్సేషనే అవుతుంది కదా. వాళ్లు తిన్నా.. కూర్చున్నా... వాళ్సు వేసుకున్న డ్రస్ లు, కార్లు, ఇళ్లు అబ్బో ఇలా ఒకటేమిటీ ఏం చేసినా అది హాట్ టాపిక్ కే అవుతుంది. ఇంతకీ ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే... రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు కదా. దేశంలోనే నెంబర్ వన్ ఆయన. ఆయన ఏం చేసినా ఓ సంచలనమే. గతంలో 27 అంతస్తుల భవనంతో సంచలనం రేపాడు. ఇక ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వాడే నగలు, స్లిప్పర్స్, దుస్తులపై కూడా ఎన్నో సంచలన వార్తలు బయటకు వచ్చాయి. గతేడాది జియో 4జీ నెట్ వర్క్‌తో సంచలనం రేపాడు. ఇప్పుడు తాజాగా.. మరో న్యూస్ బయటకు వచ్చింది. ఈసారి ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లి సందర్భంగా డిజైన్ చేసిన పెళ్లి కార్డు.
గతంలో గాలి జనార్ధన్ రెడ్డి తన కూతురు పెళ్లి కార్డును చాలా వెరైటీగా డిజైన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పుడు అది వైరల్ అయింది కూడా. ఇప్పుడు ముఖేష్ అంబానీ కుమారుడి పెళ్లికి డిజైన్ చేసిన పెళ్లి కార్డు హాట్ టాపిక్ అయింది. ముఖేష్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు ఆకాష్ పెళ్లి త్వరలోనే జరగనుంది. ఈపెళ్లి తేదీ ఎప్పుడన్నది వెల్లడికాలేదు కానీ.. సోషల్ మీడియాలో ముఖేష్ అంబానీ కొడుకు పెళ్లి కార్డు మాత్రం వైరల్‌గా మారింది. ఈ కార్డు ధర ఎంతో తెలిస్తే ఎవరికి అయినా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఈ కార్డుకు అయ్యే ఖర్చుతో ఒక ఐఫోన్ ఎక్స్‌ను కొనచ్చట. అంటే కార్డు ధర దాదాపు లక్షన్నర. ఈ కార్డు తయారీలో బంగారాన్ని వినియోగించి అత్యద్భుతంగా తీర్చిదిద్దారట. దేశంలో ఉన్న పలువరు బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, ఎంపీలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి ఈ ఆహ్వానాలు అందనున్నాయి. దీనిని బట్టి ముఖేష్ స్టామినా ఏంటో మరోసారి తేటతెల్లమైంది. మొత్తానికి పెళ్లి కార్డుతోనే అందరికీ షాకిస్తే.. ఇంక పెళ్లి ఏ రేంజ్ లో చేస్తాడో మరి..


.jpg)



