Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈయన పప్పులు చంద్రబాబు దగ్గర ఉడకడంలేదట....
posted on: Nov 25, 2017 1:26PM

టీడీపీ చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన ఏదైనా సమస్య గురించి చెప్పాలంటే దానికి తగినట్టుగా వేషదారణ వేసుకుంటూ... బుర్ర కథలు చెబుతూ మరీ.. ప్రజా సమస్యలను చూపిస్తుంటారు. ఇప్పటికే ఎన్నో వేషధారణలు.. బుర్ర కథలు వేసిన శివప్రసాద్ గారి.. బుర్రగాథలు మాత్రం చంద్రబాబుగారు వినిపించుకునే పరిస్థితిలో లేరట. దీనికి కారణం గతంలో ఎంపీగారు రెచ్చిపోవడమే. నిజానికి శివప్రసాద్ చంద్రబాబుకి బాగా సన్నిహితుడు. దీంతో చంద్రబాబే ఆయన్ని రాజకీయంగా చాలా ప్రోత్సహించారు. ముందు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆ తరువాత ఏకంగా... ఎంపీ గా గెలిపించి చేయి అందించారు. అంతే ఎంపీ గారికి కొమ్ములొచ్చినట్టు ఉన్నాయి. అందుకే సొంత పార్టీపైనే విమర్శలు చేసే స్థాయికి ఎదిగారు. 2014 ఎన్నికల్లో గెలిచిన కొద్ది కాలానికే.. వ్యక్తిగత డిమాండ్స్ తీరలేదన్న కోపంతో పార్టీ ని ఇబ్బంది పెట్టే చర్యలకు దిగారు. కొన్ని సభలు , వేదికల మీదే పార్టీ కి నష్టం చేసే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను బుజ్జగించడానికి ప్రయత్నించిన నేతల మీద కూడా ఫైర్ అయ్యారు. ఈ విషయం బాబు చెవిన పడడంతో ఆయన కూడా శివ ప్రసాద్ తో మాట్లాడినా ఎంపీ గారి ధోరణి మారలేదు సరికదా వైసీపీ కి వెళుతున్నట్టు పార్టీని బెదిరించే సంకేతాలు ఇచ్చారు.
ఇప్పుడు ఏమైంది.. ఎంపీగారికి బాగా తెలిసొచ్చినట్టు ఉంది. ఒక్క నంద్యాల ఉపఎన్నికతో అటు చాలా మంది నేతలకు, బీజేపీకి, టీడీపీని ఎదురిస్తున్న వారికి బాబు సమాధానం చెప్పారు. అంతే అందరూ తోక ముడుచుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఏంటో అందరికీ అర్దమయింది. సొంత పార్టీ నేతలే పార్టీని వీడుతున్నారు. ఇప్పుడు ఎంపీ గారికి కూడా బాగా తెలిసొచ్చి బాబు గారిని కాక పట్టే పనిలో పడ్డారట. అందుకే టీడీపీ హైకమాండ్ తో అంటే చంద్రబాబు గుడ్ లుక్స్ లో పడేందుకు ఆయన నానా పాట్లు పడుతున్నారంట. కానీ బాబు గారు ఒక్కసారి పక్కన పెడితే వాళ్ల వైపు చూడటం కష్టమైన పనే. అందుకే శివప్రసాద్ చేసిన హంగామాతో.. ఎప్పటికప్పుడు దూరంగా వుంటూ వస్తున్నారట. అయ్యగారు చెప్పే హరికథలు, బుర్ర కధలు వినడానికి ఆసక్తి చూపడం లేదట. దీంతో సీన్ అర్ధం చేసుకున్న శివప్రసాద్ బాబు సన్నిహితులతో సారీ లు చెబుతూ ఆయన కోపం తగ్గేలా చూడమని ప్రాధేయపడుతున్నారంట. మరి ఆవేశంతో ఎగరడం ఎందుకు.. మళ్లీ కాళ్లు పట్టుకోవడం ఎందుకు..


.jpg)
.jpg)


