ఇంట్లో శత్రువు దోమలు...

ఇప్పుడు వానాకాలం వచ్చిందిఈగలు తెచ్చింది.అలాగే దోమలు తెచ్చింది. దోమలు వచ్చాయా మలేరియావచ్చినట్టె ,డెంగ్యు వచ్చినట్టే అంటున్నారు నిపుణులు. ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్నామా దోమకాటుకి బలికాక తప్పదు మరి. మలేరియా వచ్చి గ్రమీనా ప్రాంతాలు,ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో పరిస్థితి  ఘోరంగా తయారౌతోంది మలేరియా రాకుండా ఇచ్చిన దోమ తెరలు అటకెక్కాయి. మాలేరియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అస్సలు తీసులోరు.ఏళ్ల తరబడి సీజన్ రాగానే  సమస్య వస్తుందని తెలుసు జాగ్రతలు చెప్పాలని ప్రజలకు అవగాహన కల్పించాలని  కోరుకుందాం.దొంగలు పడ్డ ఆరునేలలకి కుక్కలు మొరిగినట్టు మలేరియా వచ్చినవాళ్లు పిట్టలా రాలిపోయాక అప్పుడు వస్తాయి ఫాగింగ్ యంత్రాలు,నీళ్ళలో బ్లీచింగ్ పౌడర్లు. ఆ పోయేది ఏముందిలే అప్పుడుకాక పోతే ఇప్పుడు ఎవడు అడుగుతారు చ్చూసేది ఎవరు అన్నట్లు గా అధికారుల తీరుకు మనం సిగ్గుపడాలి. కనీసం ప్రధాన మున్సిపాలిటీలు,పంచాయితీలు ప్రత్యేకంగా తండాలలో కనీసం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు లేవు అత్యంత ప్రమాదకర స్థితిలో కూడా చికిత్స అందించడానికి అంబులెన్స్ లు రావు అలా కొన్ని కిలోమీటర్లు రోగిని మోసుకు పోయే డోలీలు ఎప్పుడూ చూస్తున్నాం అయినా అయినా సంవత్సరాలు గడుస్తున్న ప్రజా ఆరోగ్యం విషయంలో పూర్తిగా అశ్రద్ధ కనబరుస్తున్నారు పాలకులు.ఇప్పటికే ఫాగింగ్ చేయాలి నీరు నిల్వ ఉండే ప్రాంతాలలోవాటిని తొలగించేబాధ్యతను మున్సిపాలిటీలు,పంచాయితీలు తీసుకోవాలి మలేరియా రోగుల సంఖ్యను గుర్తించడం.క్వినైన్ మందుల పంపిణీ చేపట్టాలి అదైనా చేస్తారా లేదా? అన్నది అనుమనామే ఏ ఎటికాయేడు రోగాలు వస్తాయని తెలిసినా బాధ్యతతో కూడిన ప్రణాలికలు సిద్ధం చేయకపోవడాన్ని  చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడాన్ని ప్రజా సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

మీ ఇంట్లో దోమలు రాకుండా జాగ్రత్త పదండి...

దోమలు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో ముఖ్యంగా మీ ఇళ్ళలో ఫ్లవర్ వాజ్లు ,చేపల తోట్టెలు,మురికి కూపాలలో కాలావ గట్లు,మొదలైన ప్రాంతాలలో దోమలు గుడ్లు పెడతాయి.దోమలు లార్వా వారం రోజుల్లో పెరిగి కుట్టటం మొదలు పెడతాయి. దోమలు కుట్తాయో దద్దుర్లు,దురద,మలేరియా,బ్రెయిన్ ఫీవర్,ఫైలేరియా జపనీస్ ఎన్ సఫలైటిస్,ఎలిఫేంటియాస్,ఎలర్జీ రీయక్షన్స్, లాంటివి వచ్చే ప్రమాదం ఉంది.

దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలు....

1)నీరు నిల్వ ఉండే గుంటలను పూడ్చి వేయాలి.
2)ఫ్లవర్ పార్ట్శ్,ఫ్లవర్ వాజులు,ట్యూబులు,బక్కెట్ల లో నీటిని ఎప్పటికప్పుడు తోడేయ్యాలి.
3)పాలు కూరలు సాంబార్ పిండివంటల పైన మూత వేసుకోవాలి.
4)తలుపులు,కిటికీలుబాల్కనీలకు,తెరలు వేసి ఉంచాలి.
5)సాధ్యమైనంత వరకు దోమ తెరలు కట్టుకుని పడుకోవడం మంచిది.
6)ఆరుబయట నిద్రిస్తే కాళ్ళు చేతులను దోమలు కుట్టకుండా కపుకోవాలి.
7)ఇళ్ళను మురుగు కాల్వలకు దూరంగా ఉండేటట్లు చూడాలి.
1౦ )సిట్రో నేలా,యూకలిప్టస్ ఆయిల్ ను శరీరానికి రాసుకుంటే దోమాకాట్ల బారిన 
పడకుండా రక్షించుకోవచ్చు.
11)ఓడోమాస్ లాంటి క్రీములు టార్టాయిస్,రూస్టార్,క్రొకోడైల్ లాంటి రేపలేన్త్స్,గుడ్నైట్,
కాస్పర్ససమూరాయ్,రిపలేంట్ మ్యాట్స్ వాడవచ్చు.

దోమల మందులు చేసే అపకారం...

రిపలేంట్ క్రీమ్స్ సున్నిత చర్మాన్ని దెబ్బ తీస్తాయి. కాయిల్స్ నుంచి వచ్చే పొగవల్ల ఆస్తమా శ్వాస కొస సంబందిత వ్యాధులు వస్తాయి. స్ప్రేయర్స్ వల్ల సుస్తీ,తలనొప్పి,వికారం,ఏర్పడతాయి.ఎక్కువగా వాటిని పీల్చుకుంటే  అలర్జీలు సంభవిస్తాయి.కాబట్టి ఎవరో వాస్తారు ఎదో చేస్తారు అనుకోకుండా దోమలనుంది, దోమ కాటునుండి రక్షించుకోవాలంటే పైన చెప్పిన నివారణా చర్యలు చేపట్టండి స్వీయ రక్షణ తో అయినా ఆరోగ్యాన్ని కాపాడుకోండి.