Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...'మోడీ'ని దుర్యోధనుడు.. అమిత్‌షాను దుశ్శాసనుడు.. రేణుకా చౌదరి ద్రౌపది...
posted on: Feb 11, 2018 1:26PM

రాజ్యసభలో మోడీ ప్రసంగిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకాచౌదరి పెద్దగా నవ్విన నేపథ్యంలో ఆమెపై మోడీ సెటైర్లు విసిరిన సంగతి తెలిసిందే కదా. ..అప్పట్లో రామాయణంలో ఇలాంటి వికటాట్టహాసాలు వినేవాళ్లమని, ఇప్పుడు మరోసారి వింటున్నామని చురకలు అంటించారు. ఇక మోడీ వ్యాఖ్యలపై కూడా స్పందించిన రేణుకా చౌదరి గతంలో ప్రధాని మోదీ ఆధార్ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారని... అలాంటి మోదీ ఇపుడు ఆధార్ ను పుట్టించినదే తాము అని చెబితే నవ్వకుండా ఉండగలమా? ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడే పద్దతి అదేనా ? అని ఆమె ప్రశ్నించారు. రాజ్యసభలో కాబట్టి ఆయన సేఫ్, ఇదే వ్యాఖ్య ఆయన బయట చేసి ఉంటే ఈపాటికి ఆయనపై చట్టప్రకారం కేసు నమోదై ఉండేదని ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
అయితే ఇప్పుడు ఈ ఘటనపై కాంగ్రెస్ కు చెందిన ఓ నాయకుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా ఓ పోస్టర్ నే తయారు చేశాడు. ప్రధాని నరేంద్రమోడీ, ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా..బిజెపి మంత్రులు, ఇతర నాయకులు కౌరవులట. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు,మాజీమంత్రి రేణుకాచౌదరి ద్రౌపది అట...! ఎల్.కె.అద్వానీ.. దృతరాష్ట్రుడట. ఇంతకీ ఆపోస్టర్ పోస్ట్ చేసింది ఎవరనుకుంటున్నారా..?ఆయన ఎవరో కాదు హసీబ్ అహ్మద్'. ఆ పోస్టర్ లో 'మోడీ'ని ఆయన బృందాన్ని కౌరవులుగా వర్ణిస్తూ..ఓ పోస్టర్ వేశారు. దానిలో 'మోడీ'ని దుర్యోధనుడిగా..అమిత్‌షాను దుశ్శాసనుడుగానూ.. మిగతా..మంత్రులను కౌరవులుగానూ చిత్రీకరించారు. 'రేణుకాచౌదరి'ని ద్రౌపదిగా చిత్రీకరించి..ఆమె వస్త్రాలను కౌరవులు లాగుతుంటే..కాంగ్రెస్ అధ్యక్షుడు 'రాహుల్‌గాంధీ' కృష్ణుడుగా ఆమెకు వస్త్రాలను అందిస్తున్నట్లుగా చిత్రీకరించారు. ఈ పోస్టర్ ఇప్పుడు సోషల్‌మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. మరి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.






