Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నాన్నా చూడాలని ఉంది.. మావోయిస్టు అగ్రనేత గణపతి కుమారుడి ఆడియో మెసేజ్!
posted on: Mar 5, 2026 3:31PM

మావోయిస్టు అగ్రనాయకుడు ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి లొంగుబాట పట్టారన్నవార్తలు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు ముప్పాళ్ల వాసు విడుదల చేసిన ఓ ఆడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. తండ్రి కోసం, తండ్రి ప్రేమ కోసం చిన్నతనం నుంచీ తాను ఎలా తహతహలాడానో వివరిస్తూ ముప్పాళ్ల వాసు .. తండ్రిని ఉద్దేశించి పంపిన ఆ వాయిస్ మెసేజ్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
భావోద్వేగాలు ఉట్టిపడేలా ఆయన తండ్రిని ఇక రహస్య జీవితం చాలు, తన కోసం జనజీవన స్రవంతిలో కలిసిపొవాలని కోరుతూ చేసిన ఆ విజ్ణప్తి, వినతి, వేడుకోలు అందరిలో ఆర్థ్రత నింపుతున్నాయి. గణపతి లొంగిపోతారని, ప్రస్తుతం పోలీసుల సంప్రదింపుల్లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి సమక్షంలో ఆయన లొంగుబాటు జరిగే అవకాశం ఉందన్న సమాచారం నేపథ్యంలో గణపతి కుమారుడు విడుదల చేసిన ఆడియో మెసేజ్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
తండ్రి ప్రేమ తెలిసినవారి భావాలు ఒకలా ఉంటాయని, తండ్రి ప్రేమ కోసం ఎదురుచూసే తనలాంటి వ్యక్తి భావాలు మరోలా ఉంటాయనీ ఆయన తన వాయిస్ మెజేజ్ ను ఆరంభించారు. ఊహ తెలిసిన తరువాత ఇప్పటి వరకూ తాను తన తండ్రిని ప్రత్యక్షంగా చూడలేదని పేర్కొన్న వాసు.. ఎన్నోకష్టనష్టాలకు ఓర్చి తన తల్లి తనను పెంచి పెద్దవాడిని చేసిందని చెప్పుకొచ్చారు. తన వాయిస్ మెసేజ్ తో వాసుదేవరావు తండ్రిని జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని కోరారే తప్ప.. ఇంత కాలం ఆయన అనుసరించిన ఉద్యమ బాట గురించి విమర్శిస్తూ పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చు అలా జనం కోసం సర్వం త్యాగం చేయడాన్ని ప్రస్తుతించారు.






