క‌వితకు ఎమ్మెల్సీ.. మ‌రి, నిరుద్యోగుల‌కు ఉద్యోగాలు ఏవి?

ఎంపీగా కూతురు ఓట‌మిని తట్టుకోలేక‌పోయారు. కొన్నిరోజులు ఆగి ఎమ్మెల్సీని చేసేశారు. ఆ ప‌ద‌వీ కాల‌మూ ముగిసింది. బిడ్డ‌ను ఒక్క‌రోజు కూడా ఖాళీగా ఉంచ‌కుండా.. వెంట‌నే మ‌ళ్లీ రాజ‌కీయ ఉద్యోగం ఇచ్చేశారు. నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీని చేసేశారు. కూతురు కోసం అంత చేసిన కేసీఆర్‌.. మ‌రి, తెలంగాణ బిడ్డ‌లంతా ముఖ్య‌మంత్రిగా ఆయ‌నకు పిల్ల‌లులాంటి వారు కాదా? వారంతా ఉన్న‌త చ‌దువులు చ‌దివి.. ఏళ్లుగా ఖాళీగా ఉంటున్నారు. ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం క‌ళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్నారు. నోటిఫికేష‌న్లు ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌ను వేడుకుంటున్నారు. వారి గోడును మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు ప్ర‌భుత్వం. క‌విత‌కు వెంట‌నే ఎమ్మెల్సీ ఉద్యోగం ఇచ్చిన‌ట్టు.. నిరుద్యోగుల‌కు కూడా ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఇవ్వ‌వా కేసీఆర్ అంటూ అంతా నిల‌దీస్తున్నారు. 

ఇదే విష‌యంలో సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బిడ్డ ఒకసారి ఎన్నికల్లో ఓడిపోతేనే.. కేసీఆర్ గుండె తల్లడిల్లింది.. బిడ్డకు రెండుసార్లు ఎమ్మెల్సీ, ఇప్పుడు మంత్రి పదవిని కట్టబెట్టేందుకు కేసీఆర్‌ రెడీగా ఉన్నారని మండిపడ్డారు. 

నోటిఫికేషన్స్ లేక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. రోజుకో నిరుద్యోగి చనిపోతుంటే దొరకు కనపడట్లేదని విమ‌ర్శించారు. నిరుద్యోగులను బలితీసుకుంటున్న హంతకుడు కేసీఆర్ అని ఆరోపించారు. ‘‘నీ బిడ్డలే బిడ్డలు కానీ ఇతరుల బిడ్డలు బిడ్డలు కాదా’’ అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 
--ఆ అన్నకు చెల్లే.. అందుకే మౌనం..

--ర‌వీంద‌ర్‌సింగ్‌తో ఈట‌ల స్కెచ్‌.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో కేసీఆర్‌కు రిట‌ర్న్ గిఫ్ట్‌..