రాయదుర్గంలో మైనర్ డ్రైవింగ్‌కు మరొకరు బలి..!

posted on: Aug 7, 2026 5:06PM

 

మైనర్లకు వాహనాలు అప్పగిస్తే జరిగే ప్రమా దాలు ఎంతటి విషాదాన్ని మిగులుస్తాయో మరో ఘటన చాటిచెప్పింది. రాయదుర్గం పరిధిలో మైనర్ బాలుడు నడిపినట్లు చెబుతున్న కారు అతివేగంగా దూసుకెళ్లి రోడ్డు దాటుతున్న ముగ్గురు స్నేహితులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లీ జిల్లాకు చెందిన సుదీప్తి దాస్ అక్కడి కక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సుదీప్తి దాస్, సౌమెన్ రాయ్, అభిజిత్ రాయ్ ముగ్గురు స్నేహితులు. వీరు షేక్‌పేట్ రేణుక ఎల్లమ్మ ఆలయం సమీపంలో రోడ్డు దాటు తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. అదే సమయంలో మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వైపు ఓ కారు వేగంగా వెళ్తోంది. రోడ్డు దాటుతున్న ముగ్గురు స్నేహితులను గమనించక పోవడం లేదా వాహనాన్ని అదుపు చేయలేకపోవడమో తెలియదు కానీ కారు అత్యంత వేగంగా వెళ్లి వారిని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో కారు బలంగా ఢీకొట్టడం తో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సుదీప్తి దాస్‌కు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడి కక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు సౌమెన్ రాయ్, అభిజిత్ రాయ్‌ల కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. కారును మైనర్ బాలుడు నడుపుతున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా పోలీసులు అనుమాని స్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఎవరు ఉన్నారు? కారు యజమాని ఎవరు? మైనర్ బాలుడికి వాహనం ఎలా అందింది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలను కూడా పరిశీలిస్తున్నారు. మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదం డ్రులు, వాహన యజమా నులు బాధ్యత వహించా ల్సిన అవసరం ఉందని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తున్నప్పటికీ.. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉన్నాయి. రాయదుర్గం ఘటనలో ఒక నిండు ప్రాణం కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఒకవైపు మైనర్ డ్రైవింగ్, మరోవైపు అతివేగం.. వెరసి ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Minor driving in Rayadurgam, West Bengal, Hooghly District, Sudeepti Das, Soumen Roy, Abhijit Roy, CM Revanth reddy, CP Sajjanar, DGP C.V. Anand

google-ad-img
    Related Sigment News
    • Loading...