కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు.. ఎందుకంటే?

posted on: Apr 13, 2026 1:07PM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించారు. మంత్రి సీతక్క కేసీఆర్ కు లీగల్ నోటీసు పంపించడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

అంగన్ వాడీలకు మొబైల్ ఫోన్ ల కొనుగోలు వ్యవహారంలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి సీతక్క కేసీఆర్ కు నోటీసులు పంపారు. బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.

బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడియా కార్యకలాపాలకు ఆ పార్టీ అధినేతగా కేసీఆర్ బాధ్యత వహించాలని పేర్కొన్న సీతక్క, ఆ పోస్టులన్నిటినీ వెంటనే తొలగించి.. 48 గంటలలోగా తనకు కేసీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలన్ని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తాను విధించిన నిర్ణీత గడువులోగా కేసీఆర్ స్పందించకుండా ఆయనపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.  సీతక్క కేసీఆర్ కు లీగల్ నోటీసు పంపించిన వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.  

google-ad-img
    Related Sigment News
    • Loading...